ఈ కాలంలో డబ్బు ఉంటేనే మనిషికి ఎంతో విలువ.. సమాజంలో గౌరవం. అయితే డబ్బులు ఊరికే రావు.. కష్టపడి సంపాదించాలి. అయితే కష్టపడి సంపాదించన సొమ్ము వృదా ఖర్చు చేయకుండా కాస్త పొదుపు చేస్తే భవిష్యత్ లో ఆ పొదుపు చేసిన సొమ్ము మనల్ని కాపాడుతుంది. మీరు రిటైర్ మెంట్ అయ్యే సమయానికి ఒక కోటి రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. అందుకోసం ఈ పొదుపు స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో ప్రతి నెలా పొదుపు చేస్తూ వెళ్తే మీ రిటైర్మెంట్ వయసుకు కొటిన్నర వస్తాయి. మరి ఇంతకీ ఏ స్కీం.. ఎలా అంత డబ్బు రిటర్న్స్ పొందవొచ్చు అన్న విషయం గురించి తెలుసుకుందాం.. నేటి సమాజంలో లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటే అంత సులభమైన పని కాదు.. అలా అని కష్టమైన పని కూడా కాదు.. మనకు డబ్బు విషయంలో పలు జాగ్రత్తలు.. ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. ఇది ఉంటే పేదవాడు కోటీశ్వరుడు కావొచ్చు.. క్రమశిక్షణ లేనివాడు బిక్షాధికారి కావొచ్చు. సాధారణంగా పేదవారు ఆర్థికంగా పుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు స్కీం లు ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. ఈ స్కీం లో జాయిన్ అయితే మీరు పొదుపు చేసిన డబ్బు తిరిగి తీసుకుంటే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో రిటర్న్స్ చక్కగా వస్తాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ అంటుంటారు.. రిస్క్ లేకుండా పొదుపు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ లో పొదుపు చేస్తే మంచి లాభాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనం రిటైర్మెంట్ అయ్యేనాటికి కోటిన్నర తిరిగి పొందవచ్చు. ప్రతి సంవత్సరం పీపీఎఫ్ అకౌంట్ లో రూ.1,50,000 పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మనం నెలకు రూ.12,500 పొదుపు చేయవలసి ఉంటుంది. ఇక ఈ పీపీఎఫ్ వడ్డీ రేటు విషయానికి వస్తే.. 7.10 శాతం వరకు ఉంటుంది. మనం ముప్పై ఏళ్లపాటు పీపీఎఫ్ లో మనం పొదుపు చేస్తే రూ.45 లక్షల వరకు అవుతుంది. ఇక 7.1 శాతం వడ్డీ లెక్కన మొత్తం రూ.1.54 కోట్లు రిటర్న్స్ వస్తాయి. ఇలా మీరు పీపీఎఫ్ అకౌంట్ లో రూ.45 లక్షల రూపాయలు పొదుపు చేసినట్లయితే ఒక కోటికి పైన డబ్బు రిటన్ వస్తుందన్నమాట. అంతేకాదు ఇందులో దాచుకున్న డబ్బుకు పన్ను మినహాయంపు సౌలభ్యం కూడా ఉంది. ఈ విధంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు జమ చేసి పన్ను మినహాయింపులు పొందొచ్చు. అయితే పీపీఎఫ్ అకౌంట్లో 30 ఏళ్ల పాటు డబ్బులు జమ చేయాలంటే పొదుపు చాలా ముందుగా ప్రారంభించాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: మీకు పదేళ్ల వయసున్న పిల్లలున్నారా.. ఈ ఖాతా తెరవండి నెలకు రూ.2500 లాభం..!