దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు.. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరా..? అని ప్రతి ఒక్కరూ ఆరా తీయడం సహజం. వారి వద్ద అంత డబ్బు ఎలా ఉంటుంది. ఎలా సంపాదిస్తుంటారు. అంటూ తికమక ప్రశ్నలతో అయోమయానికి గురవుతుంటారు. అలాంటి ప్రశ్నలకు పూర్తి సమాచారమే ఈ కథనం. దేశీయ అపర కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది. అలాగే ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి అంబానీ ఒక్కరే ఉన్నారు. 9వ స్థానంలో ఉన్నారు. ఇక దేశంలో అత్యంత సంపన్నుల్లో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ 53 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.
షేర్ మార్కెట్లో ఆర్‌ఐఎల్ షేర్లకు తెగ డిమాండ్ ఏర్పడడంతో అంబానీ మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఆర్‌ఐఎల్ షేరు 3 శాతం పెరిగింది. అంతేకాదు.. గత వారం రోజుల్లో ఏకంగా 14 శాతం వృద్ధి చెందింది. దీంతో రిలయెన్స్ షేరు ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరింది. అలాగే, అదానీ షేర్లు క్షీణించడం కూడా అంబానీకి కలిసొచ్చింది. నిజానికి గతేడాదితో పోల్చితే ముకేశ్ సంపద 20 శాతం (21 బిలియన్ డాలర్లు) క్షీణించింది. అయినప్పటికీ అదానీ సంపద ఏకంగా 60 శాతం పడిపోవడంతో అంబానీ అగ్రస్థానానికి చేరుకున్నారు. హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ నేపథ్యంలో అదానీ సంపద పెద్ద ఎత్తున కరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
Chennai: Despite the erosion of 20 per cent or $21 billion in wealth, Reliance Industries Chairman and Managing Director Mukesh Ambani continue to be in the top 10 wealthiest individuals in the world with a wealth of $82 billion, states the 2023 M3M Hurun Global Rich List. For th pic.twitter.com/ph3ztlISv9
— Deccan News (@Deccan_Cable) March 22, 2023
అదానీ సంపద పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని హిండెన్‌బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అదానీ కంపెనీ షేర్లు ఢమాల్‌మన్నాయి. ఫలితంగా లక్షల కోట్ల అదానీ గ్రూప్ సంపద ఆవిరయ్యింది. కాగా, ఈ ఏడాది ప్రారంభం వరకు అదానీ అంతర్జాతీయ కుబేరుల స్థానంలో రెండో స్థానంలో ఉండేవారు. గ్రూప్ కంపెనీలతోపాటు వ్యక్తిగత సంపద కూడా కరిగిపోవడంతో ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి పడిపోయారు. ఇక, ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ సంపదను కోల్పోయిన వారిలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు. దాదాపు 70 బిలియన్ డాలర్ల సంపదను బెజోస్ కోల్పోయారు. ఇది అంబానీ, అదానీ కలిపి పోగొట్టుకున్న సంపదతో పోలిస్తే ఇంకా ఎక్కువ కావడం గమనార్హం.
Mukesh Ambani becomes the only Indian to feature in the 2023 M3M Hurun Global Rich List’s top 10. Find out who the 10 richest Indians in the world are #Top10 #Richest #RichestIndians #MukeshAmbani #Adani #Ambani #Reliance pic.twitter.com/D8zLNGUoQY
— CNBC-TV18 (@CNBCTV18News) March 22, 2023