గతంలో ఎవరికైన డబ్బులు పంపిచాలి అంటే.. బ్యాంక్ వెళ్లి, లైన్ లో నిలబడి, ఓ రోజు మెుత్తం కేటాయించాలి. కానీ టెక్నాలజీ పెరిగాక మనీ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ చాలానే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిల్లో పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు ముఖ్యమైనవి. దాంతో అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో డబ్బును ఒకరి నుంచి మరోకరికి బదిలీ చేయవచ్చు. ఇలా డబ్బు పింపించే క్రమంలో పేమెంట్ ప్లాట్ ఫామ్స్ నుంచి మనీ రివార్డ్స్, గిఫ్ట్ కూపన్లు సైతం వస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ యూజర్లను ఆకట్లుకోవడానికి రకరకాల ఆఫర్లను వారికి అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సంస్థ అయిన గూగుల్ పే తమ యూజర్లకు దీపావళీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు మనీ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
గూగుల్ పే.. దాదాపు ప్రతీ ఒక్కరి ఫోన్లలో ఉండే ప్రముఖ పేమెంట్ ప్లాట్ ఫామ్. ఇప్పటికే గూగుల్ పే ద్వారా మనీ పంపించినప్పుడు రివార్డు కింద కొద్ది మెుత్తంలో డబ్బులు రావడం మనం చూస్తూనే ఉంటాం. అదీ కాక గిఫ్ట్ ఓచర్లు సైతం వస్తూనే ఉంటాయి. అయితే ఈ దీపావళిని మరింత సంతోషంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ పే తమ యూజర్లకు ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో గేమ్ ఆడి డబ్బును పొందొచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఏంటి? మనీ ఎలా గెలుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్ పే యూజర్లు అయితే.. మీరు మీ ఫోన్ లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి.. ముందుగా ప్రొమోషన్స్ విభాగంలో ఉన్న ఇండి-హోమ్ చాట్ ను ఓపెన్ చేయాలి. మీరు రివార్డ్స్ గెలుచుకునేందుకు దీంట్లో కొన్ని ఫ్లోర్స్ ను నిర్మించాల్సి ఉంటుంది. మీరు సింగిల్ గానైనా, మీ ఫ్రెండ్ తో కలిసి అయిన దీన్ని ఆడవచ్చు.
అదీ కాక ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ప్రతీ స్టెప్ కు రివార్డ్స్ దక్కుతాయి. ఎవరికైన డబ్బు పంపించడం, క్యూఆర్ కోడ్ ను వాడి మనీ పంపడం లాంటి టాస్క్ లు సైతం ఈ స్టెప్స్ లో ఉంటాయి. దీపావళి పండగలో భాగంగా.. ఈ నెల 27వ తారిఖు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ కాంటెస్ట్ లో పాల్గొనే మెుదటి 5 లక్షల టీమ్స్ రూ. 200 వరకు మనీని క్యాష్ బ్యాక్ గా పొందవచ్చు. అయితే మీరు టీమ్ లేకుండా ఈ గేమ్ లో పాల్గొంటే.. రూ. 200 కంటే తక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే టాస్క్ స్టెప్స్ లో భాగంగా.. మీ స్నేహితుడికి మనీ పంపిస్తే.. రూ. 30 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తే.. కూడా 30 రూపాయలు రివార్డు వస్తుంది. ఇలా ఒక్కో స్టెప్ కు కొంత కొంత రివార్డ్స్ వస్తూంటాయి. ఈ క్రమంలోనే “అక్టోబర్ 27వ తారిఖు లోగా టాలెస్ట్ దీపావళీ మేళాను నిర్మించండి” అంటూ గూగుల్ పే సంస్థ పేర్కొన్నది. యూజర్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని గూగుల్ పే సూచించింది.