దేశంలో నగదురహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ బాగా చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు యూపీఐ పేమెంట్స్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బ్యాంక్ సర్వర్ల కారణంగా పేమెంట్స్ జరగవు. అలాంటి సమయాల్లో కస్టమర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అర్జెంటుగా షాపింగ్ చేయాలా..? చేతిలో డబ్బులేదా..? బాధపడకండి.. అలాంటి వారందరికీ ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని 'బై నౌ పే లేటర్' సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఖర్చు చేసిన డబ్బులను ఒకేసారి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలుగా మార్చుకునే కొత్త వెసులుబాటు కల్పించింది.
యూపీఐ యాప్ పేమెంట్స్ మీద అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఎన్పీసీఐ ఏం చెప్పిందంటే..!
ప్రస్తుతం దేశంలో నగదురహిత లావాదేవీలు జోరందుకున్నాయి. ప్రతి చిన్న అవసరానికి నగదుతో పనిలేకుండా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. వ్యాపారులు, దుకాణదారులు కూడా ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే షర్ట్ ఏసుకోవాలి, ప్యాంట్ ఏసుకోవాలి, స్కూటర్ స్టార్ట్ చేయాలి, బ్యాంకుకెళ్ళాలి, డిపాజిట్ ఫార్మ్ రాయాలి, డబ్బులు కట్టాలి, అవి వాళ్ళ అకౌంట్ లో పడాలి. మళ్ళీ వాళ్ళు షర్టు, ప్యాంటు, స్కూటరు, బ్యాంకు, విత్ డ్రా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ తర్వాత డెబిట్ కార్డులొచ్చాక రాసుడు ప్రక్రియ పోయి ఏటీఎం నుంచి తీసుడు, ఆన్ లైన్ లో గీకుడు ప్రక్రియ మొదలైంది. ఎప్పుడైతే పెద్ద నోట్ల […]
దేశంలో డిజిటల్ చెల్లింపుల వేగం పుంజుకుంటోంది. ఎక్కడ చూసినా.. గూగుల్ పే, ఫోన్ పే అంటూ డిజిటల్ వ్యాలెట్ల క్యూఆర్ కోడ్ లు దర్శనమిస్తున్నాయి. చిరువ్యాపారులు మొదలుకొని పెద్ద షాపింగ్ మాళ్లు, సూపర్ స్టోర్ వరకు.. అన్నింటా క్యూఆర్ స్కానింగ్ లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ సదుపాయంతో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నగదు చెలామణి తగ్గిపోయింది. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు తిరిగి డబ్బును చెలామణీలోకి తిరిగి తీసుకొచ్చే […]
కరోనా కారణంగా మనదేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీపై పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు.. బ్యాంక్‌లు ఏటీఎం సేవల మీద పలు రకాల చార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టడంతో.. చాలా మంది యూపీఐ పేమెంట్స్‌కు షిప్ట్ అయ్యారు. కిరాణ షాపు మొదలు.. బంగారు ఆభరణాలు కొనుగోలు వరకు.. ఇలా ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అయితే […]
కరోనా తర్వాత మనుషుల చేతుల్లో డబ్బు కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. కారణం.. ప్రస్తుతం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో పర్స్‌లో డబ్బులు పెట్టుకుని.. దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లే బాధ తప్పింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉండి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. టీ కొట్టు మొదలు.. ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడ అయినా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ […]
మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైఓల్టేజీ మ్యాచులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయమ సాధించిన సంగతి తెలిసిందే. బంతి బంతికి విజయం దోబూచులాడుతున్న తరుణాన విరాట్ కోహ్లీ తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని మేల్కొలపడంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఈ విజయంతో భారత అభిమానులు దీపావళి సెలెబ్రేషన్స్ ఘనంగానే జరుపుకున్నారు. అయితే అదే సమయంలో మనకి తెలియని మరో ఆశ్చర్యకర ఘటన కూడా నమోదయ్యింది. కోహ్లీ దెబ్బకు […]
గతంలో ఎవరికైన డబ్బులు పంపిచాలి అంటే.. బ్యాంక్ వెళ్లి, లైన్ లో నిలబడి, ఓ రోజు మెుత్తం కేటాయించాలి. కానీ టెక్నాలజీ పెరిగాక మనీ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ చాలానే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిల్లో పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు ముఖ్యమైనవి. దాంతో అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో డబ్బును ఒకరి నుంచి మరోకరికి బదిలీ చేయవచ్చు. ఇలా డబ్బు పింపించే క్రమంలో పేమెంట్ ప్లాట్ ఫామ్స్ […]