ఇద్దరు అన్నదమ్ములు అడుగు భూమి కోసం కొట్టుకుంటారు. భూమి అంటే అంత ప్రీతి. వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఇంకా వదులుకోవాల్సి వస్తే బంధాలను వదులుకుంటారు. అలాంటి మనుషులున్న సొసైటీ ఆఫ్ ఇండియాలో కోతుల పేరిట ఏకంగా 32 ఎకరాల భూమి రాసుకొచ్చారు. మనుషులకే సెంటు భూమికి దిక్కు లేదు. అలాంటిది కోతుల పేరు మీద ఏకంగా 32 ఎకరాల భూమి రాయడమంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 32 ఎకరాల భూమికి వారసులు ఆ కోతులు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగానే నిజం. ఈ వింత చోటు చేసుకుంది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఉపల గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
ఉపల గ్రామంలో సుమారు 100 కోతులు ఉన్నాయి. ఆ 100 కోతుల పేరిట 32 ఎకరాల భూమి రాసి ఉంది. పంచాయతీ రికార్డుల్లో స్పష్టంగా ఈ 32 ఎకరాల భూమి కోతులకే సొంతం అని వీలునామా రాశారు. అటవీశాఖ మొక్కలు నాటిన ఆ భూమిలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూడా ఉంది. దీని కోసం గొడవలు కూడా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూమి మొత్తం కోతులకే చెందుతుందని తేల్చడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ జనరల్ ఎంవీ రావు కన్ఫర్మ్ చేశారు. ఉపల గ్రామంలో 32 ఎకరాల భూమికి కోతులు యజమానులని, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఇది నిజం అని కన్ఫర్మ్ చేశారు. వంద కోతులు ఈ భూమికి యజమానులుగా ఉన్నాయని తెలిపారు.
ఇక గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. కోతుల పేరు మీద అంత భూమిని ఎవరు రిజిస్టర్ చేశారో తెలియదు గానీ ఒకప్పుడు తమ గ్రామస్తులు పెళ్లిళ్ల సమయంలో వాటిని ప్రత్యేకంగా గౌరవించేవారని అన్నారు. వివాహ సమయంలో వాటికి ఏదో ఒక బహుమతి ఇచ్చిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం ఒక ఆచారం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఆచారాన్ని తక్కువ మంది పాటిస్తున్నారు. అయినప్పటికీ కోతులు ఇంటి ద్వారం దగ్గరకి వస్తే తినడానికి ఏమైనా పెడతామని అంటున్నారు. సంవత్సరాలుగా వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తుందని, ఇప్పుడు వాటి సంఖ్య వందకి పడిపోయిందని అన్నారు. ప్రస్తుతం అటవీ శాఖ భూమిలో ప్లాంటేషన్ పనులు చేస్తుందని తెలిపారు. ఇండియాలో ఒక మనిషికి సెంటు భూమి దొరకడం గగనం. అలాంటిది ఎవరు ఇచ్చారో గానీ మహానుభావులు కోతులు 32 ఎకరాల భూమికి యజమానులు అయిపోయాయి. ఈ భూమిలో ఎన్నో పండ్ల చెట్లు ఉన్నాయి. ఎంచక్కా జీవితాంతం ఆ భూమిలో హ్యాపీగా బతికేయచ్చు.
Monkeys In THIS Maharashtra Village Officially Own 32 Acres Of Land https://t.co/3pwJuVluF1
— PUNE MEDIA (@MediaPune) October 21, 2022