ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ తాజాగా వేల కోట్లు నష్టపోయారు. బుధవారం ఒక్కరోజే ఆయన సంపద అక్షరాలా రూ.49 వేల కోట్లు ఆవిరైంది. ఇందుకు కారణం అమెరికాకు చెందిన ఓ ఇన్వెస్టిగేషన్ సంస్థ అదానీపై సంచలన ఆరోపణలు చేయడమే. అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్ నే మోసం చేశాయంటూ ఆరోపణలు చేశారు. తాము చేసిన రీసెర్ట్ లో అదానీ కంపెనీలు అకౌంటింగ్ లో మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినట్లు తేలిందంటూ నివేదికలు కూడా విడుదల చేశారు. ఆ రిపోర్టుల కారణంగానే అదానీ సంపద ఆవిరైంది. ఈ విషయంపై అదానీ గ్రూప్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకుంటామంటూ వ్యాఖ్యానించారు.
గౌతమ్ అదానీపై అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ కు పాల్పడ్డారంటూ విమర్శలు చేసింది. అదానీ గ్రూపునకు చెందిన 7 స్టాక్స్ ను దాదాపుగా రెండేళ్లపాటు రీసెర్చ్ చేసి ఈ విషయాలను వెల్లడించామన్నారు. రుణాలతో పెట్టుబడులు పెట్టి మళ్లీ రుణాలు పొందారంటూ ఆరోపించారు. ఈ వార్తలు రావడంతో అదానీకి చెందిన స్టాక్స్ అన్నీ రెడ్ జోన్లోనే ట్రేడ్ అయ్యాయి. ఆయన సంపద ఆవిరైంది. బుధవారం ఒక్కరోజే ఆయనకు రూ.49 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో స్థానాన్ని కోల్పోయారు. ఆయన ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. అమెజాన్ జెఫ్ బెజోస్ మూడో స్థానానికి వెళ్లారు.
NEW FROM US:
Adani Group – How The World’s 3rd Richest Man Is Pulling The Largest Con In Corporate Historyhttps://t.co/JkZFt60V7f
(1/x)
— Hindenburg Research (@HindenburgRes) January 25, 2023
ఈ హిండెన్ బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇదొక కక్షపూరిత నివేదిక అంటూ కొట్టిపారేసింది. ఇప్పటికే హిండెన్ బర్గ్ సంస్థపై లీగల్ గా యాక్షన్ తీసుకునే దిశగా పరిశీలనలు మొదలు పెట్టినట్లు తెలిపారు. భారతదేశం మాత్రమే కాకుండా.. అమెరికాలో కూడా చట్టాలకు లోబడి కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్న అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ రిపోర్టు తమ పెట్టుబడిదారులు, షేర హోల్డర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అదానీ గ్రూపు లీగల్ హెడ్ జతిన్ జలుంధ్ వాలా తెలిపారు. వారు చేసిన ఆరోపణలు భారతీయ మార్కెట్ లో సైతం అనిశ్చితికి దారి తీస్తుందన్నారు. అసలు వాళ్లు ఎలాంటి పరిశోధన చేయకుండానే నివేదికను సమర్పించారన్నారు.
Media statement – II on a report published by Hindenburg Research pic.twitter.com/Yd2ufHUNRX
— Adani Group (@AdaniOnline) January 26, 2023