ఎలన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా ఈయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఈయన పేరు చెప్పగానే అపర మేథావి, ప్రంపంచంలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా చెప్పేవారు. కానీ, ఒక్క సంవత్సరంలో అంతా మారిపోయింది. సంపాదనలో రికార్డులు సృష్టించిన వ్యక్తి.. ఇప్పుడు సపంద కోల్పోవడంలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయిన తొలి వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డులకెక్కారు. అసలు ఆయన సంపద ఎందుకు పోయింది? ఈ పతనానికి కారణాలు ఏంటో చూద్దాం.
2021వ సంవత్సరం ఎలన్ మస్క్ కు బాగా కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏడాది జనవరిలో మస్క్ 200 బిలియన్ క్లబ్ లో చేరాడు. అప్పటివరకు జెఫ్ బెజోస్ మాత్రమే ఆ స్థితిలో ఉండగా.. మస్క్ అతని సరసన చేరాడు. రెండేళ్ల వ్యవధిలో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఎలన్ మస్క్ అదే 200 బిలియన్ డాలర్లతో చెత్త రికార్డును సృష్టించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ ల సీఈవో ఈసారి భారత కరెన్సీలో 16 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయి రికార్డుల కెక్కారు. ఇంత మొత్తంలో సంపద కోల్పోయిన మొదటి వ్యక్తిగా ఎలన్ మస్క్ రికార్డు సృష్టించారు.
అయితే ఇతని సంపద మొత్తం కోల్పోయవడానికి కారణం.. టెస్లా షేర్లు పతనం అవ్వడమే. మస్క్ సంపద చాలా వరకు టెస్లా కంపెనీ షేర్ల రూపంలోనే ఉంది. టెస్లా కంపెనీ షేర్ వ్యాల్యూ రికార్డు స్థాయిలో పతమైంది. తద్వారా మస్క్ 200 బిలియన్ డాలర్లు కోల్పోయారు. అతని వద్ద ఇప్పుడు కేవలం 137 బిలియన్ డాలర్లు మాత్రమే సంపద ఉన్నట్లు తెలుస్తోంది. స్పెస్ ఎక్స్ లో మాత్రమే మస్క్ సంపద ఎక్కువ ఉంది. స్పేస్ ఎక్స్ లో ఎలన్ మస్క్ కు ఇప్పుడు 44.8 బిలియన్ డాలర్ల వాటా ఉంది. అదే టెస్లాలో ఇప్పుడు 44 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది.
If you’re having a bad year cause you lost a lot of money in the market remember that Elon Musk has lost $200 billion and is still making jokes on twitter
— Not Jerome Powell (@alifarhat79) January 1, 2023
అంటే టెస్లా కంటే మస్క్ కు ఇప్పుడు స్పేస్ ఎక్స్ లోనే ఎక్కువ వాటా ఉంది. ఇటీవల ఈ టెక్ దిగ్గజం ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మస్క్ సంపద పతనంతో ఫ్యాషన్ కంపెనీ బాస్ బెర్నాడ్ లూయిస్ అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా మొదటి ప్లేస్ కి వచ్చారు. ఎలన్ మస్క్ రెండో స్థానంలో, భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ఎలన్ మస్క్ సంపద సృష్టించడంలోనే కాదు.. కోల్పోవడంలో కూడా రికార్డులు క్రియేట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.
Elon Musk lost over $200 billion dollars last year.
Let that sink in. pic.twitter.com/jGVhQa6LDP
— Erica Marsh (@ericareport) January 2, 2023