వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాలు కలవాలి. ఇద్దరికి పెళ్లి చేయాలంటే.. ఇరు కుటుంబాల ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు. ఏం చేస్తుంటారు? అనే ప్రశ్నతో మొదలై.. మంచి వాళ్లేనా?, బాగా ఉన్నవాళ్లేనా?, ఊర్లో పలుకుబడి గట్రా ఉన్నాయా?, ఏమైనా చదువుకున్నారా? ఇంట్లో ఎంత మంది పిల్లలు?.. ఇలా ఎన్నో వందల ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలైనా.. ఎన్ని పద్ధతులైనా వారి బాగు కోసమేగా.. మనము అంగీకరించాలి. అయితే.. పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి.
కొంతమంది వారి కులానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే.. మరి కొందరు మాత్రం వేరే కులానికి చెందిన(కులాంతర వివాహం) వారిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవుతున్న ఈ కాలంలో ఈ తంతు మరీ ఎక్కువ. అయితే.. ఇలా పెళ్లి చేసుకున్నవారు మొదట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకు ఆర్థిక సహాయం అందించే పథకం.. డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఎవరైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేదుకు ఆర్థిక భరోసా ఇస్తారు. వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఈ స్కీమ్ ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. పెళ్లి చేసుకునే వారిలో ఒకరు షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు.. మరొకరు నాన్ షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వారై ఉండాలి.
ఇది కూడా చదవండి: ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!హిందూ వివాహ చట్టం 1955 కింద వీరి పెళ్లి నమోదు చెయ్యాలి. హిందూ వివాహ చట్టం కింద కాకుండా ఇతర విధానంలో పెళ్లి చేసుకున్న వారు ప్రత్యేకమైన సర్టిఫికెట్‌ను సబ్మిట్ చెయ్యాలి. మొదటి సారి కులాంతర విహహం చేసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. కానీ రెండో పెళ్లి, మూడో పెళ్లికి ఇది వర్తించదు. అలాగే పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందటానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ క్యాస్ పెళ్లి చేసుకున్న వారికి మొత్తంగా రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రూ.1.5 లక్షల మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. అయితే దీని కోసం భార్యాభర్తలు జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. మిగిలిన లక్ష రూపాయలను మూడేళ్ళ కాలానికి ఫౌండేషన్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. మూడేళ్ల కాల పరిమితి పూర్తయ్యాక వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లిసారు.
Dr Ambedkar scheme for social Integration through inter caste marriage,involving a Dalit(Central Govt scheme) is also there,amount given is 2.5 lakh.Its “Inter Caste only”
Marriage has to be registered under the Hindu Marriages Act,1955. https://t.co/flzre9LYPl— 🇮🇳 Prabhat Yadav 🇮🇳 (@prabhatkumar76) November 21, 2020
ఈ పథకాన్ని మొదటగా..2013-14, 2014-15 లో రెండేళ్ల పాటు పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. అప్పటినుంచి రెగ్యులర్ గా కొనసాగుతోంది. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి వంటి పూర్తి వివరాల కోసం ఈ సైట్ ని విజిట్ చేయండి.