ప్రేమిస్తున్నాను అని కూతురు చెబితే.. అతడు ఎలాంటి వ్యక్తి అని చూడకుండా.. కులం, మతం, గోత్రాలు అంటూ ఎంక్వైరీ చేస్తారు. ఇక తమ కులానికి చెందిన వాడు కాదని తెలిస్తే..పెళ్లికి ససేమీరా అంటారు. కూతురు చెప్పినా వినిపించుకోకపోగా.. కట్టడి చేయడం మొదలు పెడతారు. కుమార్తె మనస్సు తెలుసుకోకుండా మరొకరితో పెళ్లి చేసేందుకు సిద్ధమౌతుంటారు.
దేశం శాస్త్ర, సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకెళుతున్నా, కుల రక్కసి వెనక్కు నెడుతోంది. తక్కువ కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా పెద్దలు సహించలేకపోతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక.. హత్యలకు పాల్పడుతున్నారు.
కులాంతర వివాహాలు చేసుకునే వారిని ఎంకరేజ్ చేయాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వారికి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మిగిలిన వివరాలు..
దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా.. కుల, మతాల పేరిట కోట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. నగరాలతో పోలిస్తే, గ్రామాల్లో కుల రక్కసి కోరలు చాచుతూనే ఉంది. కులాల పేరుతో కొన్ని కొన్ని ఊర్లు, నగరాలు కుంపటిని రగుల్చుకుంటున్నాయి. అగ్ర కులాల ఆధిపత్య పోరులో అణగారిన వర్గాలు అందులో ఆహుతి అవుతున్నాయి. బావిలో నీరు తాగకూడదని, తమ ఇళ్లల్లోకి రాకూడదని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలతో స్నేహం, ప్రేమించడం చేయకూడదన్న ఆంక్షలు వేస్తుంటారు. వారిని కాదని […]
ప్రస్తుత కాలంలో పెళ్లి తంతు ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని చెప్పి.. అప్పు చేసి మరి ఆడంబరంగా వివాహం తంతు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, ధనవంతుల ఇళ్లల్లో అయితే ఖర్చు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పేదల సంగతి ఏంటి. అందునా ఆడపిల్ల వివాహం అంటే కట్నకానుకల పేరుతో బోలేడు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు నిరుపేద యువతలకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం […]
వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాలు కలవాలి. ఇద్దరికి పెళ్లి చేయాలంటే.. ఇరు కుటుంబాల ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు. ఏం చేస్తుంటారు? అనే ప్రశ్నతో మొదలై.. మంచి వాళ్లేనా?, బాగా ఉన్నవాళ్లేనా?, ఊర్లో పలుకుబడి గట్రా ఉన్నాయా?, ఏమైనా చదువుకున్నారా? ఇంట్లో ఎంత మంది పిల్లలు?.. ఇలా ఎన్నో వందల ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలైనా.. ఎన్ని పద్ధతులైనా వారి బాగు కోసమేగా.. మనము అంగీకరించాలి. అయితే.. పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికి వేరు […]