టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో మధ్య పోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా ప్లాన్లను విడుదల చేస్తూ.. యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పోటీతత్వంతో రెండు సంస్థలు వినియోగదారుల కోసం ఉత్తమమైన, చౌకైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. తద్వారా వినియోగదారులు ఎక్కువ కాలం తమ నెట్‌వర్క్‌లో కొనసాగింపు చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మరి.. ఈ రెండింటిలో ఏది బెస్టు అన్నది ఇప్పుడు చూద్దాం..
14 రోజులు, 20, 24, 28, 30, నెల వ్యాలిడిటీ, 56, 84, 365 రోజులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు.. ఏది బెస్టు అన్నది యూజర్ నిర్ణయించుకోవడం, కొంచెం కష్టం. అందుకే.. మీకోసం బెస్ట్ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్ వివరాలు మేంఅందిస్తున్నాం. డేటా వినియోగం/ ఓటీటీల ఉపయోగాన్ని బట్టి.. ఇందులో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు.
డేటా వినియోగం తక్కువుగా ఉంటది అనుకుంటే.. జియోలో రూ. 209 ప్లాన్, ఎయిర్‌టెల్‌లో రూ. 265 ప్లాన్ ఎంచుకోవడం ఉత్తమం.
డేటా వినియోగం ఎక్కువుగా ఉంటది అనుకుంటే.. జియో, ఎయిర్‌టెల్‌లో ఒకే ధరతో ఉన్న రూ. 299 ప్లాన్(ప్రతిరోజూ 2జీబీ డేటా) బెస్ట్ అని చెప్పొచ్చు.
జియో మరియు ఎయిర్‌టెల్ అందిస్తున్న ఇతర 2జీబీ రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్:
జియో:
2జీబీ రోజువారీ డేటా అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియోలో అందుబాటులో ఉన్నాయి. రూ.249 (23 రోజుల వ్యాలిడిటీ), రూ.299 (28 రోజుల వ్యాలిడిటీ), రూ.533 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.719 (84 రోజుల వ్యాలిడిటీ), రూ.799 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.1066 (84 రోజుల వ్యాలిడిటీ), రూ.2879 (365 రోజుల వ్యాలిడిటీ).. వంటి అనేక రకాల 2జీబీ రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అన్ని ప్లాన్లలో అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉచితం. అయితే.. ఇక్కడ రూ.1066 & రూ.799 రెండు ప్లాన్లలో సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.
ఎయిర్‌టెల్:
ఇందులో కూడా 2జీబీ రోజువారీ డేటా అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ.319 (1 నెల వ్యాలిడిటీ), రూ.359 (28 రోజుల వ్యాలిడిటీ), రూ.499 (28 రోజుల వ్యాలిడిటీ), రూ.549 (56 రోజుల వ్యాలిడిటీ), రూ.839 (84 రోజుల వ్యాలిడిటీ), రూ.2999 (365 రోజుల వ్యాలిడిటీ) ప్లాన్లు ఉన్నాయి. అన్ని ప్లాన్లలో అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు అదనంగా సదరు ప్లాన్లను బట్టి 3-నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను ఉచితంగాఅందిస్తోంది. ఈ ప్లాన్లలో ఏది బెస్టు అన్నది.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.