ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా కూడా ఇప్పటికీ అంతా బ్యాంకులనే ప్రధాన లావాదేవీల కేంద్రాలుగా భావిస్తున్నారు. చాలా మంది ఏదో పనిమీద ఇప్పటికీ తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు మనకు ఏ సేవలను కూడా ఉచితంగా ఇవ్వదని తెలిసిందే. వాళ్లు ప్రతి సేవకు ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ చాలామంది లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంలలో విత్‌డ్రాలు చేస్తూనే ఉన్నారు. అయితే గతంలో ఓసారి ఏటీఎం విత్‌డ్రాలకు పరిమితిని ప్రకటించారు. లిమిట్ దాటితో ఛార్జెస్ పడతాయని కూడా అన్ని బ్యాంకులు ముక్తకంఠంతో చెప్పాయి. అయితే ఇప్పుడు బ్యాంకులు ఆ ఛార్జెస్ వసూలు చేయడం మొదలెట్టేశాయి కూడా. మరి.. ఆ ఛార్జెస్ ఎలా ఉన్నాయి? ఏ బ్యాంక్ ఎంత వసూలు చేస్తోందో చూద్దాం..
ఎస్ బీఐ బ్యాంకు తమ కస్టమర్లకు ప్రతిచోట నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. కానీ న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా లాంటి మెట్రో నగరాల్లో ఆ సంఖ్యను 3కి పరిమితం చేసింది. మీకు కల్పించిన ఆ ఉచిత లావాదేవీలు పూర్తి అయిన తర్వాత ఛార్జెస్ వసూలు చేయడం మొదలు పెడతారు. లిమిట్ దాటిన తర్వాత ఎస్ బీఐ ఏటీఎంలలో అయితే ట్రాన్సెక్షన్ కు రూ.10, ఇతర ఏటీంలలో అయితే లావీదేవీకి రూ.20 వసూలు చేస్తున్నారు.
ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువ ఆదరణ, ఖాతాదారులను కలిగినది ఐసీఐసీఐగా చెబుతారు. ఆ బ్యాంకు కూడా అందరిలాగానే తమ ఏటీఎంల నుంచి ఐదుసార్లు ఫ్రీగా, ఇతర ఏటీఎంల నుంచి మూడుసార్లు ఉచిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఒక్కో క్యాష్ ట్రాన్సెక్షన్ పై రూ.21 వసూలు చేస్తోంది.
హెచ్ డీఎఫ్ సీ తమ ఖాతాదారులకు నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. మెట్రో నగార్లో అయితే హెచ్ డీఎఫ్ సీ కాని ఏటీఎంలలో కూడా ఐదుసార్లు నగదు లావాదేవీలు చేయచ్చు. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఖాతాదారుల నుంచి విత్ డ్రా చేస్తే రూ.21 వసూలు చేస్తోంది.