స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశీయ బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ఇందులో నూటికి తొంబై శాతం మందికి ఖాతాలు ఉండే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ వార్త. ఈమధ్యన ఎస్‌బీఐ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్‌ల నుంచి డబ్బులు కట్ అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు వెళుతున్నాయి. అయితే తాము ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా డబ్బులు ఎందుకు డెబిట్ అవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వాస్తవేమే అయినప్పటికీ.. ఎందుకు కట్ అయ్యాయి..? […]
స్వయం శక్తితో ఎదగాలి… జీవితంలో అభివృద్ధి చెందాలని భావించే మహిళలకు భారతీయ స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఏకంగా 20 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే అందరూ దీనికి అర్హులు కారు. కేవలం స్వయం సహాయక బృందాలకు మాత్రమే ఈ లోన్ ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలను అందిస్తోంది. ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి క్యాంపైన్‌లో భాగంగా.. ఎస్‌బీఐ స్వయం సహాయక బృందాలకు రూ.10 […]
మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే కాక.. దేశానికి అన్నం పెడుతున్న రంగం వ్యవసాయం. మన దేశంలో వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. అవును మరి.. నేల తల్లి మీద అమితమైన ప్రేమతో.. పండించే పంటను సొంత బిడ్డలా కాపాడుకుంటాడు రైతు. తీరా పంట చేతికి వచ్చి.. నాలుగు రూపాయలు మిగులుతాయనుకునే వేళ.. ప్రకృతి అయినా నష్టం కలిగిస్తుంది.. లేదా.. ప్రభుత్వాలు సరైన మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యి.. రైతలకు తీరని అన్యాయం చేస్తాయి. అటు […]
డబ్బే పరమావధిగా బతుకుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఏ ఒక్క రూపాయి మనకు కలిసొస్తుందన్నా తప్పక తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి వార్తే. ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉన్నా ప్రతి ఒక్కరి పేరుపైనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉండి ఉంటుంది. కాకుంటే ఇది వారు ఉపయోగించే కార్డు రకాన్ని బట్టి వర్తిస్తుంది. కనిష్టంగా రూ.2 లక్షలు మొదలుకొని గరిష్టంగా రూ. 20 లక్షల వరకూ ఈ భీమా వర్తిస్తుంది. అయితే ఇందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. […]
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తమ ఖాతాదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్ల కోసం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా పెన్షన్ స్లిప్ కోసం బ్యాంకు శాఖకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే పొందేందుకు వీలు కలగనుంది. దీని ద్వారా పెన్షన్ స్లిప్ పొందాలనుకునే ఖాతాదారులు తమ బ్యాంకులో రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ నుంచి + 91 9022690226 అనే మొబైల్ నంబర్‌కు […]
జాబ్ చేసే ఆలోచన లేదు.. సొంత ఊరిని విడిచి దూరంగా పట్నం వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఊరిలో ఉపాధి మార్గాలు తక్కువ.. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే.. కనీసం లక్ష రూపాయాలైనా పెట్టుబడి పెట్టాలి.. కానీ అంత మొత్తం చేతిలో లేదు… ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వాళ్ల కోసమే భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి.. తగిన సొమ్ము లేక బాధపడుతున్న […]
దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ ఖాతాదారులకు కోలుకోలేని షాకిచ్చింది. చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకురావడానికి నానా అవస్థలు పడుతున్న సామాన్యులపై మరో గుదిబండ మోపింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తే సర్వీస్ ఛార్జీ వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రతి నెలా సాధారణంగా చేసే చెల్లింపుల్లో అద్దె చెల్లింపు ప్రధానమైన ఖర్చుల్లో ఒకటి. కిరాయి ఇళ్లలో ఉండాలంటే సకాలంలో అద్దె చెల్లించాల్సిందే. అయితే.. కొన్ని అత్యవసర […]
ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా కూడా ఇప్పటికీ అంతా బ్యాంకులనే ప్రధాన లావాదేవీల కేంద్రాలుగా భావిస్తున్నారు. చాలా మంది ఏదో పనిమీద ఇప్పటికీ తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు మనకు ఏ సేవలను కూడా ఉచితంగా ఇవ్వదని తెలిసిందే. వాళ్లు ప్రతి సేవకు ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ చాలామంది లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంలలో విత్‌డ్రాలు చేస్తూనే […]
దేశంలోని అతిపెద్ద, పురాతన బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఖాళీలుగా ఉన్న 1422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. […]
భారతదేశంలో ఉన్న అతి ప్రధానమైన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఒకటి. ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగానికి చెందిన ఈ దిగ్గజ బ్యాంకు ప్రకటించింది. అన్ని టెన్యూర్లపై 20 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు […]