యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు, డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ సంస్థ మొదటి నుంచి భారతదేశం విషయంలో ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తోంది. భారత్ లో ఆఫ్ లైన్ స్టోర్స్ కూడా స్థాపించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు చైనాలోని ప్లాంట్ ను ఇండియాకి తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇండియా మార్కెట్ పై యాపిల్ సంస్థ ఎంత పాజిటివ్ గా ఉందో గతకొన్ని రోజులుగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ సైతం పలు సందర్భాల్లో ఇండియాని, మన దేశ వాణిజ్య విధానాన్ని ప్రశంసించారు. ఇండియాలో ఆన్ లైన్ మాత్రమే కాదు.. ఆఫ్ లైన్ స్టోర్లు సైతం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా యాపిల్ సంస్థ చైనాలోని తమ తయారీ కర్మాగారాన్ని ఇండియాకి తరలించబోతోందనే వార్తలు వచ్చాయి. చాలామంది వాటిని రూమర్స్ అనుకున్నారు. కానీ, ఆ వార్తలు నిజమేనని రాజీవ్ చంద్రశేఖర్ ధ్రువీకరించారు.
యాపిల్ సంస్థకు సంబంధించిన తయారీ కేంద్రం రాబోతోందని తెలియజేశారు. ఈ సరికొత్త ప్లాంట్ వల్ల రాష్ట్రంలో లక్షకుపై ఉద్యోగాలు వస్తాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో 300 ఎకరాల్లో యాపిల్ సంస్థ తయారీ కేద్రం ఏర్పాటు కానున్నట్లు రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. యాపిల్ ఫోన్స్ త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో తయారీ అవుతాయని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు రావడమే కాకుండా.. ఎన్నో గొప్ప అవకాశాలు ఏర్పడతాయని స్పష్టం చేశారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చే క్రమంలో మన రాష్ట్రం వంతు భాగస్వామ్యం అందిద్దాం అంటూ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ట్వీట్ చేశారు.
ఈ అంశానికి సంబంధించి బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ వైరల్ అవుతోంది. బెంగళూరులో విమానాశ్రయానికి దగ్గరగా.. ఫాక్స్ కాన్ 300 ఎకరాల్లో ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ కేంద్రంలో యాపిల్ ఐఫోన్ పార్ట్స్ ని తయారు చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇంకొంతమంది ఈ కేంద్రంలోనే ఐఫోన్ అసెంబ్లింగ్ కూడా జరుగుతుందని చెబుతున్నారు. వాక్స్ కాన్ కంపెనీ వారి ఎలక్ట్రికల్ వాహనానికి సంబంధించిన విడి భాగాల తయారీకి కూడా ఈ కేంద్రాన్ని వినియోగిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ అంశాలకు సంబంధించి యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు.
Agreement signed with Foxconn, leading electronics major, to make major investment in state after a detailed discussion with co’s C’man Young Liu. It will expected to create 1 lakh jobs. 300 acres of land near Bengaluru Int. airport allocated.
1/2 pic.twitter.com/oDPQMQbVPo— Basavaraj S Bommai (@BSBommai) March 3, 2023