దేశంలో మరో బ్యాంక్ దివాళా తీసింది. ఇష్టమొచ్చినట్లు రుణాలు మంజూరు చేసి.. వాటిని తిరిగి రాబట్టలేక ఖాతాదారుల సొమ్ముకు మేం బాధ్యులంకాదంటూ చేతులెత్తేసింది. దీంతో రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సదరు దివాళా తీసిన బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసి.. ఖాతాదారుల భద్రత కోసం చర్యలు చేపట్టింది.
దేశంలో నగదు చలామణి అవ్వాలన్నా, ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా బ్యాంకులే మూలాధారం. అలా అని ఒక్క ఆర్థిక లావాదేవీలకే పరిమితమైతే.. బ్యాంకులకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. అందువల్ల అధిక లాభాల కోసం ఖాతాదారులు పొదుపు చేసే మొత్తాన్ని ఇతరులకు రుణాలు కింద మంజూరు చేస్తుంటాయి. అయితే, ఈ రుణాలు మంజూరు అనేది ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉండాలి. కానీ, ఓ బ్యాంకు వీటిని అతిక్రమించింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు రుణాలు మంజూరు చేసింది. అనంతరం వీటిని తిరిగి రాబట్టలేక.. డిపాజిటర్ల సొమ్మును చెల్లించలేమంటూ చేతులెత్తేసింది.
మధ్యప్రదేశ్లోని గుణా ప్రధాన కేంద్రంగా ‘గర్హా సహకరి బ్యాంక్’ కార్యాకలాపాలు సాగిస్తోంది. ఇది సహకార బ్యాంకు కావడంతో బోర్డు అఫ్ డైరెక్టర్లు ఇష్టమొచ్చిన రీతిలో రుణాలు మంజూరు చేశారు. అనంతరం సకాలంలో రుణాలు తిరిగి చేపట్టకపోవడంతో డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడానికి మూలధనం లేకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన ఆర్బీఐ సదరు బ్యాంకు లైసెన్స్ ను సోమవారం రద్దు చేసింది. ఫలితంగా బ్యాంకు డిపాజిట్ల స్వీకరణ, తిరిగి చెల్లించడం వంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా నిషేధించింది.
RBI cancels licence of MP-based Garha Co-operative Bank pic.twitter.com/eLwtzRzZRJ
— Vikas Muley (@drvikasm) February 20, 2023
“గర్హా సహకరి బ్యాంక్ వద్ద తగినంత మూలధనం లేదు. ఫలితంగా డిపాజిటర్లకు పూర్తి చెల్లింపులు చేయలేకపోతోంది. అయితే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) కింద ఈ బ్యాంకులో ఖాతాలు ఉన్న 98.4 శాతం మంది డిపాజిటర్లు తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు..” అని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఏదేని బ్యాంకు దివాళా తీయడం, నగదు విషయంలో అవకతవకలు జరిగినట్లుగా తేలినపుడు డిపాజిటర్లు నష్టపోకుండా ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా కల్పిస్తుంది. దీని ద్వారా బ్యాంకులో చేసిన డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. అంటే.. ఎంత మొత్తంలో మీ డిపాజిట్లు ఉన్నా రూ. 5 లక్షల వరకు తిరిగి పొందవచ్చన్నమాట. మీలో ఎవరికైనా ఈ బ్యాంకులో ఖాతా ఉన్నట్లయితే జాగ్రత్తపడవలనని మనవి. ఇలా వరుసగా బ్యాంకులు దివాళా తీస్తుండడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
About 98.4 per cent of the depositors of the co-operative bank are entitled to receive full amount of their deposits from Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC), the RBI said in a statement.#GarhaCooperativeBank #Guna #MadhyaPradeshhttps://t.co/IDFaSkfDxZ
— Economic Times (@EconomicTimes) February 20, 2023