హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. సామాన్యుడు కొనాలంటే కొనలేని పరిస్థితి. అయితే హైదరాబాద్ సెంట్రల్ లో కాకుండా కూకట్ పల్లి, మియాపూర్ ఏరియాలకు దగ్గర ఏరియాల్లో ల్యాండ్స్ చూస్తే తక్కువ ధరకు లభిస్తాయి. అలాంటి ఏరియా గురించి ఇవాళ తెలుసుకోబోతున్నారు.
కూకట్ పల్లి సమీపంలో అంటే 15 కి.మీ. దూరంలో బౌరంపేట్ అనే ఏరియా ఉంది. ఈ ఏరియాలో కనుక ల్యాండ్ ధర చాలా తక్కువగా ఉంది. గజం రూ. 26 వేల నుంచి ఉన్నాయి. చదరపు అడుగు రూ. 2,889 పడింది. 150 గజాల స్థలానికి రూ. 39 లక్షలు అవుతుంది. ఈ ఏరియాలో 150 నుంచి 300 గజాలు చొప్పున స్థలాలు అందుబాటులో ఉన్నాయి. 300 గజాలకు రూ. 78 లక్షలు అవుతుంది. ఇదే ఏరియాలో గజం రూ. 29 వేల నుంచి రూ. 45 వేల రేంజ్ లో ఉన్నాయి. చదరపు అడుగు రూ. 3300 నుంచి రూ. 4900 రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ ఏరియాలో 2 బీహెచ్కే, 3 బీహెచ్కే, 4 బీహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
బీహెచ్కే ఫ్లాట్ సైజ్ 1000 నుంచి 1300 చదరపు అడుగులు ఉంటుంది. దీని ధర చదరపు అడుగుకు రూ. 4500 నుంచి రూ. 5000 రేంజ్ లో ఉంటుంది. 2 బీహెచ్కే ఫ్లాట్ కి రూ. 45 లక్షల నుంచి రూ. 65 లక్షల బడ్జెట్ అవుతుంది. 1300 నుంచి 1700 చదరపు అడుగుల్లో 3 బీహెచ్కే ఫ్లాట్ వస్తుంది. దీని ధర రూ. 60 లక్షల నుంచి రూ. 85 లక్షల బడ్జెట్ లో దొరుకుతున్నాయి. 3 బీహెచ్కే విల్లా అయితే 2300 నుంచి 2370 చదరపు అడుగుల విస్తీర్ణంలో వస్తుంది. చదరపు అడుగుకి రూ. 8 వేలు అవుతుంది. ధర రూ. కోటి 84 లక్షల నుంచి రూ. కోటి 90 లక్షల రేంజ్ లో ఉంది. అదే 4 బీహెచ్కే విల్లాకైతే రూ. 2 కోట్ల 45 లక్షల నుంచి రూ. 3 కోట్ల 83 లక్షలు అవుతుంది. 2980 నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వస్తుంది.
ఈ ఏరియాలో 1 బీహెచ్కే ఫ్లాట్లు రూ. 20 లక్షల నుంచి 30 లక్షల బడ్జెట్ లో దొరుకుతాయి. 550 నుంచి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 బీహెచ్కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ కావాలనుకుంటే కనుక చదరపు అడుగు రూ. 2500 చొప్పున రూ. 18,75,000 అవుతుంది. అదే రూ. 3750 చొప్పున ఐతే రూ. 28,12,500 అవుతుంది. గుండ్లపోచంపల్లికి 4 కి.మీ, బాచుపల్లి నుంచి 5 కి.మీ, గండిమైసమ్మ నుంచి రూ. 6 కి.మీ, మియాపూర్ కి 12 కి.మీ, కూకట్‌పల్లి, హైదర్ నగర్ ఏరియాలకు 15 కి.మీ దూరంలో ఈ బౌరంపేట్ ఉంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలకి 20 కి.మీ దూరంలో ఉన్న బౌరంపేట్ లో రూ. 39 లక్షల బడ్జెట్ లో 150 గజాల స్థలం, 30 లక్షల బడ్జెట్ లో ఫ్లాట్స్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునేవారికి, పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ ఏరియా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.