11 లక్షలకు 150 గజాల ప్లాట్ ఆ? అది అసాధ్యం అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. 11 లక్షలు పెట్టి స్థలం కొంటే రెండేళ్లలో 22 లక్షల ప్రాఫిట్ వస్తుంది. ఆ ఏరియా ఎక్కడో మీరే చూడండి.
స్థలం, భూమి, ప్లాట్ ఎలా పిలిచినా గానీ డబ్బుంటేనే మన దగ్గరకు వస్తుంది. సొంతిల్లు కట్టుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే హైదరాబాద్ లాంటి నగరంలో సొంతిల్లు అనేది సామాన్య, దిగువ మధ్యతరగతి వ్యక్తులకు ఎప్పటికీ నెరవేరని కలే. అయితే మీరు కొన్ని టిప్స్ పాటిస్తే గనుక అతి తక్కువ కాలంలోనే హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకోవచ్చు. లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు. సొంతిల్లు కట్టుకునే ఆసక్తి లేకపోయినా, సొంతిల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా గానీ ఇన్వెస్టర్ గా ఉంటూ కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. 11 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్లలో 22 లక్షల ప్రాఫిట్ ను పొందవచ్చు. కాలం వేగంగా గడిచిపోతుంది. మీరు పెట్టిన పెట్టుబడి రెండేళ్లలో డబుల్ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ విలువ అనేది ఎప్పుడూ పెరుగుతుంది కాబట్టి.
ఇంతకే ఈ ల్యాండ్ ఎక్కడ ఉందంటే? నిమ్జ్ దగ్గరే. నిమ్జ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్.. 12,635 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే గనుక పరిశ్రమలు, సంస్థలు వస్తాయి. లక్షల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. బాగా అభివృద్ధి చెందిన నగరంలో ఇండ్ల స్థలం కొనే కంటే అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతంలో ల్యాండ్ కొనుగోలు చేస్తే తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం పొందవచ్చు. మరి 11 లక్షలకే 150 గజాల ప్లాట్లు ఎక్కడున్నాయో తెలుసా? ఝరాసంగంలో ఉన్నాయి. నిమ్జ్ నిర్మాణం ఝరాసంగం, జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో జరుగుతోంది. ఈ ఝరాసంగం జహీరాబాద్ నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది.
హైదరాబాద్ నుంచి 125 కి.మీ. దూరం ఉంది. లాంఛింగ్ ఆఫర్ కింద ఒక్కో గజం రూ. 7,500 చొప్పున 150 గజాలను 11 లక్షల 25 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వంద ప్లాట్లు అమ్ముతున్నారు. అన్నీ ఓపెన్ ప్లాట్లే. డీటీసీపీ అండ్ హెచ్ఎండీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవి. స్విమ్మింగ్ పూల్, పార్క్, విశాలమైన రోడ్లు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్థలం కొన్నాక ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు లేదా మీకు విక్రయించిన వాళ్ళే కట్టిస్తారు. లేదు మంచి ధర వచ్చాక అమ్ముకుంటామన్నా గానీ అమ్ముకోవచ్చు. మీకు విక్రయించిన వారే మీకు కస్టమర్ ని చూస్తారు. ఇప్పుడు గజం రూ. 7,500కు కొనుగోలు చేస్తే.. రెండేళ్లలో ఒక్కో గజాన్ని రూ. 15 వేలకు వాళ్లే విక్రయిస్తామని చెబుతున్నారు. అంటే 11 లక్షలకు 22 లక్షలు ఆదాయం వస్తుంది. ఇంతకంటే మంచి ఆఫర్ ఏముంటుంది చెప్పండి.
అభివృద్ధి చెందే ఏరియాలో స్థలం కొంటే దాని విలువ అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది. అందులోనూ నిమ్జ్ కి సమీపంలో ఉన్న ప్రాంతంలో స్థలాలు అంటే మంచి గిరాకీ ఉంటుంది. స్థలం కొని జాగ్రత్తగా పునాది వేసి మెల్లగా ఇంటి పనులు చేపడుతూ నిమ్జ్ నిర్మాణం పూర్తయ్యే సరికి ఇల్లు పూర్తి చేస్తే.. మీకు బోలెడు అద్దెలు వస్తాయి. ఝరాసంగం కూడా హైదరాబాద్ లానే డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఇలా ఉంటుందని ఎవరైనా ఊహించారా? ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఎవరైనా అనుకున్నారా? ఇప్పుడు రెంట్లు కట్టలేని పరిస్థితి. ఇక ఇల్లు కొనడం అంటే గగనమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాస్త దూరమైనా గానీ డెవలప్ అవుతున్న ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచి పనే కదా. దూరం అని ఆలోచించకండి. డబ్బుకు దూరంతో పని లేదు. అది ఎక్కడున్నా డబ్బే. కాకపోతే పెట్టుబడి పెట్టే చోటు ముఖ్యం బిగిలు. ప్రస్తుతం ఈ ఏరియాలో ప్లాట్లు గజం 6 వేలకు, 7 వేలకు, 10 వేలకు, 15 వేలకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ వారు ఒక్కో ధరకు అమ్ముతున్నారు.
గమనిక: పైన తెలుపబడిన సమాచారం మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఆయా ప్రాంతాలను బట్టి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలను బట్టి స్థలాల ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందు లేదా స్థలం కొనేముందు ఆ ఏరియాలో మిగతా కంపెనీల ధరలు, డాక్యుమెంట్లు, నిమ్జ్ కు ప్లాట్ ఎంత దూరంలో ఉంది అనే విషయాలు పరిశీలించుకోవాల్సిందిగా మనవి.