‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ఫుల్ జోష్ తో నడుస్తోంది. ప్రేక్షకులు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రతివారం ఇంట్లో నుంచి ఒకరు బయటకు వెళ్లడం.. ప్రతివారం ఒకరు కెప్టెన్ కావడం జరుగుతూనే ఉంటుంది. ఈ వారం మొదటివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముమైత్ ఖాన్ తిరిగి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచిన సంగితి తెలిసిందే. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కాస్త చర్చనీయాంశం అయ్యింది. ఈ వారం కెప్టెన్ గా అఖిల్ గెలిచాడు. అయితే అఖిల్ సార్ధక్ గెలుపుపై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తోంది. అదీ ఒక గెలుపేనా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ పై ప్రముఖ క్రిటిక్ ఫస్ట్ రివ్యూ!
కెప్టెన్సీ కోసం ఇచ్చిన టాస్కులో శివ కూడా ఉన్నాడు. అయితే వాళ్లంతా కలిసి కావాలని యాంకర్ శివను సైడ్ చేసిన విషయం అందరూ చూశారు. నటరాజ్ మాస్టర్ కూడా అందరిలో ఒకరు అవ్వకూడదు.. అదీ మీకు తెలుసు దాన్ని బట్టి ఆడండి అని చెప్పాడు. క్లియర్ గా అఖిల్ టీమ్ మొత్తం కలిసి కట్టుగా ఆడి యాంకర్ శివను ఓడించారు. తర్వాత వాళ్లలో వాళ్లు కూడా కెప్టెన్సీ కోసం బాగానే కొట్టుకున్నారు. నాకు కావాలంటే నాకు అంటూ కుస్తీ పడ్డారు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ నాకు కావాలని పట్టుబట్టగా ఆమెను తెలివిగా తప్పించారు. ఆ తర్వాత చివరకు అజయ్ vs అఖిల్ అయ్యింది. అజయ్ గేమ్ లో తేలిపోవడంతో అఖిల్ కెప్టెన్ అయ్యాడు. అఖిల్ గ్రూప్ గేమ్ ఆడి గెలిచాడంటూ కామెంట్ చేస్తున్నారు. అఖిల్ కెప్టెన్ అయ్యేందుకు గ్రూప్ గేమ్ ఆడాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.