బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గాయపడ్డాడు. అందుకు సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అఖిల్ కు ఏమైంది?
తెలుగులో చాలామంది ప్రేక్షకులు తిట్టుకున్నా సరే చూసే షో ఏదైనా ఉంది అంటే అది ‘బిగ్ బాస్’ అని చెప్పొచ్చు. ఏడాదికో సీజన్ చొప్పున టెలికాస్ట్ అయిన ఈ షో.. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్’ షోతో ఫేమ్ తెచ్చుకున్న వాళ్లలో అఖిల్ సార్థక్ ఒకడు. నాలుగో సీజన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచిన అతడు.. ఆ తర్వాత ఓటీటీ షోలోనూ రన్నరప్ గానే బయటకొచ్చాడు. తాజాగా తను గాయపడినట్లు ఓ వీడియోని పోస్ట్ చేశాడు. చాలా విషయం చెప్పుకొచ్చాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తుంటారు. అలా బీబీ జోడీ పేరుతో ఓ డ్యాన్స్ షో ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఇందులో తేజస్వినితో కలిసి ఫెర్ఫార్మెన్సులు ఇస్తున్న అఖిల్.. తాజాగా గాయపడ్డాడు. ఎప్పటినుంచో పొత్తి కడుపు దిగువన నొప్పిగా ఉన్నప్పటికీ.. తాను డ్యాన్స్ చేస్తూ వచ్చానని పేర్కొన్నాడు. ఇది అది కాస్త ఎక్కువవడం, భరించలేనంత నొప్పిగా మారడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
‘ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది కరెక్ట్ గా చూపించలేదు. అందుకే ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తోంది. నా నొప్పి ఆడియెన్స్ కు కనిపించదు. షో మధ్యలో నుంచి వెళ్లిపోయానని అనుకుంటారు. మేం దిగువ నుంచి టాప్-2లో ఉన్నాననేది చాలా షాకింగ్ గా అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కు రాలేనని ఛానెల్ వాళ్లకు తెలుసు. అందుకే ఇలా చేసి ఉంటారు. మమ్మల్ని కిందకు లాగితే మరో జోడిని సేవ్ చేయొచ్చనేది వాళ్ల ఆలోచన కావొచ్చు బహుశా. నేను తేజూ బెస్ట్ ఇచ్చాం. ఎంతో కష్టపడ్డాం. నొప్పితో బాధపడ్డానంటే ఎవరూ నమ్మడం లేదు’
‘అది నాకు చాలా బాధగా ఉంది. షో నుంచి వెళ్లిపోవడానికి కారణాలు వెతుకుతున్నారని అంటున్నారు. నాకు వెళ్లాలని ఉంటే.. ఇన్నిరోజులు ఎందుకు ఉంటాను. ఇంతలా ఎందుకు కష్టపడతాను. అయినా సరే ఇన్నిరోజులు మీరిచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. నన్ను క్షమించండి. మరో షోతో మీ ముందుకు వస్తాను’ అని అఖిల్ ఎమోషనల్ అవుతూ వీడియో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా అఖిల్-తేజస్విని జోడీ.. మిగతా జోడీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ వచ్చారు. అలాంటిది సడన్ గా షో నుంచి ఎగ్జిట్ అయ్యేసరికి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. అఖిల్ కు గాయమవడం, బయటకు రావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.