బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అరియానా.. ఆ పేరును కంటిన్యూ చేసేందుకు తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ని పదేపదే ప్రదర్శిస్తోంది. అందులో ప్రధానంగా 'బిగ్ బాస్ జోడి' ప్రోగ్రామ్ లో జబర్దస్త్ అవినాష్ కి జోడిగా రచ్చ లేపుతోంది.
బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకొని.. సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అదే క్రేజ్ తో అటు బుల్లితెరపై రాణిస్తూనే.. మరోవైపు సినీ అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. ఆ విధంగా బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అరియానా.. ఆ పేరును కంటిన్యూ చేసేందుకు తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ని పదేపదే ప్రదర్శిస్తోంది. బిగ్ బాస్ షోతో అరియానాకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆ ఫేమ్ ని కాపాడుకుంటూ బోల్డ్ నుండి గ్లామర్ బ్యూటీగా కూడా క్రేజ్ దక్కించుకుంది.
ఈ క్రమంలో యూట్యూబ్ యాంకర్ నుండి బుల్లితెర సెలెబ్రిటీగా మారిన అరియానా.. ప్రస్తుతం టీవీ షోలలో అలరిస్తోంది. అందులో ప్రధానంగా ‘బిగ్ బాస్ జోడి’ ప్రోగ్రామ్ లో జబర్దస్త్ అవినాష్ కి జోడిగా రచ్చ లేపుతోంది. అయితే.. బిగ్ బాస్ జోడిలో ప్రతివారం అదిరిపోయే గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. ఓవైపు స్టేజ్ పై అదరగొడుతూనే.. మరోవైపు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ తో సెగలు రేపుతోంది. తాజాగా బిగ్ బాస్ జోడిలో అవినాష్ తో పెర్ఫార్మన్స్ అనంతరం.. అఖిల్ సార్థక్, తేజస్వి మడివాడ, రోల్ రైడాలతో కలిసి రచ్చ చేసింది. ఈ నేపథ్యంలో వారితో కలిసి సందడి చేసిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది అరియానా.
తాజా ఫోటోలో అరియానా.. అఖిల్ ఒడిలో కూర్చొని, అందాల విందు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జనరల్ గా అరియానాని ఇంతకన్నా బోల్డ్ గా చూసినప్పటికీ.. ఇలా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ ఫోటోలో అఖిల్ ఒడిలో కూర్చోవడమే కాకుండా.. థైస్ షో చేసి ఫాలోయర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది భామ. ప్రెజెంట్ అరియానాకి సంబంధించి ఈ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి బోల్డ్ బ్యూటీగా పేరొందిన అరియానా.. బుల్లితెరపై ఆకట్టుకుంటున్నప్పటికీ.. సినిమాలలో పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా లేదట. ఎంతైనా ఆర్జీవి స్కూల్ నుండి వచ్చింది కదా! ఆ మాత్రం బోల్డ్ నెస్ ఉంటుందిలే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అరియానా బోల్డ్ నెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.