బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 ముగిసిపోయింది. ఇంక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కావడం మాత్రమే పెండింగ్ ఉంది. అయితే విన్నర్, రన్నర్, టాప్ 5 ఇలాంటి విషయాలు ఇప్పటికే లీకుల ద్వారా తెలిసిపోయింది. కాకాపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున అధికారికంగా చేయి గాల్లోకి లేపి ప్రకటించాల్సి ఉంది. అయితే బిందు మాధవి విన్నర్ కావడానికి అర్హురాలేనా? అఖిల్ కి అన్యాయం చేసి బిందు మాధవికి టైటిల్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు, నిరసనలు చేస్తున్నారు. అయితే నిజంగానే బిందు మాధవి టైటిల్ గెలిచేందుకు అర్హురాలేనా?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టైటిల్ గెలిచిన తొలి లేడీ ఇంటి సభ్యురాలిగా బిందు మాధవి రికార్డు సృష్టించింది. నిజానికి ఈ సీజన్లో అబ్బాయిల కంటే అమ్మాయిలను ఎక్కువ మందిని పంపిన సమయంలోనే లేడీ విన్నర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులపై ఉన్న అపవాదను కూడా బిందు విన్నర్ కావడంతో తుడిచేసినట్లు అయ్యింది. నిజానికి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో బిందు మాధవి టైటిల్ ఫేవరెట్ గానే ఇంట్లో అడుగుపెట్టింది.
తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్న అనుభం కూడా ఆమెకు ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. టాస్కులు, పోటీదారులు మారచ్చేమో గానీ, బిగ్ బాస్ కాన్సెప్ట్ మాత్రం మారదు. ఒక మనిషిలోని ఒరిజినాలిటీ బయటకు తీసుకురావడమే వాళ్ల కాన్సెప్ట్. అయితే మొదటి వారం నుంచి బిందు మాధవి ఎంతో చక్కగా ఆడుతూ వచ్చింది. ఎక్కడా కూడా పక్షపాతం, స్వార్థం లేకుండా ఆడిందంటూ అభిమానులు కితాబిస్తున్నారు.
తప్పు చేసింది మిత్రుడైనా నిలదీసి.. నిజాయితీ గేమ్ ఆడిందంటూ మెచ్చుకుంటున్నారు. హౌస్ లో యాంకర్ శివతో ఎంతో క్లోజ్ గా ఉన్నా కూడా.. టాస్క్ లో మాత్రం అతడిని కూడా ఓ ప్రత్యర్థిలాగే చూసి శభాష్ అనిపించుకుంది. నామినేషన్స్ లో ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తోందో పాయింట్ టూ పాయిటం క్లియర్ గా చెప్పడం మరింత ఆకట్టుకున్న విషయం. అన్నింటి కంటే ఆమె ఆలోచన విధానం ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చిన విషయం.
అంతేకాకుండా ఒక తెలుగమ్మాయిగా ప్రవర్తన, వస్త్రధారణ కూడా ఆకట్టుకున్న అంశం అనే చెప్పాలి. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతూ ఆడపులి అని పేరు సంపాదించుకుంది. కొందరు గ్రూపులుగా పనిగట్టుకుని ఆమెను టార్గెట్ చేయడం కూడా బాగా కలిసొచ్చిన అంశం అనే చెప్పాలి. ఎందుకంటే అలా కొందరు ఆమెను టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడం వల్లే బిందు మాధవికి సింపతీ పెరిగిందనేది మరో వాదన.
నటరాజ్ మాస్టర్ కు కూడా బిందు మాధవి ఫ్యాన్స్ ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే హౌస్ లో నటరాజ్ మాస్టర్ ఎక్కువగా బిందు మాధవితోనే గొడవలు పడ్డాడు. అది కూడా బిందు మాధవికి బాగా ప్లస్ అయిన పాయింట్ అనే చెప్పాలి. ఎదుట ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నా కూడా ఎక్కడా తగ్గకుండా ఆమె గేమ్ ఆడిన తీరు ప్రేక్షకులను ఆమెకు అభిమానులుగా మారేలా చేసింది.. మొత్తానికి టైటిల్ తెచ్చిపెట్టింది. బిందు మాధవి టైటిల్ విన్నర్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బిందుమాధవిపై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!
ఇదీ చదవండి: హౌస్ లోని సభ్యులపై నటరాజ్ మాస్టర్ సీరియస్.. దొంగ ఓట్లతో గెలుస్తున్నారు!