ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికలపై క్రేజ్ రాగానే బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. బులితెరపై క్లిక్ అయిన వెంటనే పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెడుతున్నారు సోషల్ మీడియా స్టార్స్. ప్రారంభమైన కొద్దికాలంలోనే విశేష ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ముందంజలో ఉంటుంది. మొదట్లో విమర్శించినా.. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
ఇప్పటివరకు 5 సీజన్లు ముగించుకున్న బిగ్ బాస్.. త్వరలోనే సరికొత్త OTT సీజన్ తో ప్రేక్షకులను పలకరించనుంది. అందుకు కావాల్సిన అన్ని హంగులను బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. అయితే.. ఈసారి బిగ్ బాస్ లోకి ఎవరెవరు వస్తారా..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరో కంటెస్టెంట్ అంటూ ఓ పేరు చక్కర్లు కొడుతోంది. తెలుగు బుల్లితెర పై యాంకర్ గా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న స్రవంతి చోకారపు పేరు బలంగా వినిపిస్తుంది. కొంతకాలంగా టాలీవుడ్ సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది. అటు టీవీ ప్రోగ్రాంలలో, ఇటు ఇంస్టాగ్రామ్ లో అందాల షో అదరగొడుతోంది. ఇటీవల పుష్ప టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడి ఆకట్టుకుంది. మరి ఈ బ్యూటీ బిగ్ బాస్ ఎంట్రీ ఖాయమని టీవీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బిగ్ బాస్ ఓటిటి సీజన్ ఈ నెల 27న ప్రారంభం కానుందని అంటున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. మరి త్వరలోనే కంటెస్టెంట్స్ లిస్ట్ తో పాటు, షో డేట్, ప్రోమోలు కూడా రానున్నాయి. మరి బిగ్ బాస్ ఓటిటి సీజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.