ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకులను ఆద్యాంతం ఆకట్టుకుంటాయి. అటువంటి రియాలిటీ షోలల్లో ముందు వరుసలో ఉండేది బిగ్ బాస్. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ఇచ్చే కిక్కే వేరు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకులను ఆద్యాంతం ఆకట్టుకుంటాయి. అటువంటి రియాలిటీ షోలల్లో ముందు వరుసలో ఉండేది బిగ్ బాస్. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ఇచ్చే కిక్కే వేరు. బిగ్ బాస్ లో పాల్గొనే సెలబ్రిటీలతో మరింత ఆదరణ లభిస్తుంది. కాగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా సందడి చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
ఈ సారి బిగ్ బాస్ షోను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నారు. హిందీ బిగ్ బాస్ రెండో సీజన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా ఈ షోలో ఎవరు పాల్గొంటున్నారన్న విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా మాజీ పోర్న్ స్టార్, మియా ఖలీఫాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్ టైమ్ మోడల్ గా కెరియర్ ఆరంభించిన మియా ఖలీఫా శృంగార తారగా మారి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇండియాలో కూడా సన్నిలియోన్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ మియా ఖలీఫానే.
బిగ్ బాస్ సీజన్ 2లో భాగంగా బిగ్ బాస్ వర్గాలు మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. హిందూస్థాన్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, మియా మరియు రాజ్ కుంద్రా ఇద్దరి కోసం సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీని గురించి అధికారిక సమాచారం వెలువడలేదు కానీ, మియా ఖలీఫా కనుక బిగ్ బాస్ షోకు అంగీకరిస్తే అది ఖచ్చితంగా వేరే లెవెల్ లో ఉంటుందని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి.