బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో ఎవరు పాల్గొంటారు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేది వీరే అంటూ ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూసేయండి.
బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల అల్లర్లు, గొడవలు, భావోద్వేగ సన్నివేశాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని ఒక చోట మిక్స్ చేసి చూపిస్తూ క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే అంతా సిద్ధం చేశారు నిర్వాహకులు. అయితే లాస్ట్ సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈ సీజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని షో నిర్వాహకులు భావిస్తున్నారు. కొత్త వ్యక్తులను హౌజ్ లోకి తీసుకురావడంతో పాటు సరికొత్త టాక్స్ లతో అలరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభానికి ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఈ షో కోసం బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలను.. పారితోషికం ఎక్కువ ఇచ్చి మరీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలను, కొత్త జంటలను హౌజ్ లోకి తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ లిస్టులో సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, ఆయన భార్య తేజస్విని, మహేష్ బాబు కాళిదాసు, సిద్దార్థ్ వర్మ ఉన్నట్టు సమాచారం. యాంకర్స్ దీపికా పిల్లి, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ ఈ జాబితాలో ఉన్నట్లు టాక్. మంగ్లీ, హేమచంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి వంటి సింగర్స్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. అలానే విడిపోయిన సింగర్ నోయల్, ఆయన మాజీ భార్య ఎస్తేర్ నోరోన్హా కూడా హౌజ్ లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్రా శర్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈటీవీ ప్రభాకర్, కొరియోగ్రాఫర్ పండు, జబర్దస్త్ అప్పారావు, న్యూస్ రీడర్ ప్రత్యూష, డాన్సర్ శ్వేతా నాయుడు, ట్రాన్స్ జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనాక్, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఐతే ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున బదులు రానా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియదు కానీ ఈసారి హౌజ్ లోకి అడుగుపెట్టే వారి జాబితా చూస్తుంటే మాత్రం షో బంపర్ హిట్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది. అందరూ పెద్ద వాళ్ళే. యాంకర్లు, యాక్టర్లు, సింగర్లు, యూట్యూబర్లు, ముఖ్యంగా నోయల్, ఎస్తేర్ జంట.. వీళ్ళు కనుక నిజంగా హౌజ్ లోకి వస్తే మాత్రం రసవత్తరంగా కొనసాగుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.