బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిగా మారిపోయింది. అందుకే ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె.. బన్నీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ టాప్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప సినిమా హిందీలో కూడా రిలీజై.. నార్త్ ఇండియాలో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో బన్నీ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. అలానే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ ప్రముఖలందరూ బన్నినీ ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల హేమ మాలిని.. బన్నీకి ఫ్యాన్ గా మారిపోయింది.
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిగా మారిపోయింది. అందుకే ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె.. బన్నీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఇటీవలే తాను పుప్ప సినిమాను చూశానని తెలిపారు. అందులో అల్లు అర్జున్ మేకోవర్, డ్యాన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని హేమమాలిని చెప్పారు. అంతేకాక పుష్ప కోసం బన్నీ తనను తాను ఎంతగానో మార్చుకున్నాడని అన్నారు. బన్నీ చేసిన సాహసం ఎప్పటికీ బాలీవుడ్ హీరోలు చెయ్యలేరంటూ హేమ సంచలన కామెంట్స్ చేశారు.
ఇక పుష్ప సినిమాలోని పాటలకు అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ను తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే తాను కూడా ఇష్టంగా ఇమిటేట్ చేశానని చెప్పారు. అంతేకాక బన్నీ నటించిన మరో సినిమా కూడా చూశానని, అది కూడా బాగుందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అందంగా కనిపించాడని హేమమాలిని తెలిపింది. ఆ సినిమాతో ఎంతో డ్రీమ్ బాయ్ లా కనిపించిన బన్నీ.. పుష్ప కోసం రఫ్ లుక్ ను, లుంగి కట్టుకుని నటించాడు. ఇలాంటి పాత్రలో బాలీవుడ్ హీరోలు అయితే నటించరు. ఇలా మాస్ లుక్, రోల్ పోషించడానికి బన్నీ అంగీకరించడం నిజంగా గ్రేట్ అని హేమమాలిని.
రజియా సుల్తాన్ మూవీ కోసం ధర్మేంద్ర కాస్త నల్లగా కనిపించాలంటే చాలా ఆలోచించారని హేమ మాలిని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పుష్ప లో అల్లు అర్జున్ డ్యాన్స్ కు, నటనకు . సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు సాక్షాత్తూ హేమా మాలినిలాంటి నటే బన్నీ పై ఇలా ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించడంతో ఆయన అభిమానులు ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు. మరి.. హేమమాలిని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.