తెలుగులో బిగ్ బాస్ ఓటిటి హంగామా మొదలైంది. మొన్నటివరకు ఎదురుచూసిన ఈ షో ప్రారంభం కావడంతో ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ లను వారు సపోర్ట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోయారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలపాటు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో పాత, కొత్త అంటూ మొత్తం 17 మంది పాల్గొన్నారు. అందులో పాతవాళ్లను వారియర్స్ గా, కొత్తవాళ్లను ఛాలెంజర్స్ గా డివైడ్ చేశారు.
ఇక బిగ్ బాస్ లో 3వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. ఒకప్పుడు ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ ఐటమ్ సాంగ్స్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ముమైత్.. బిగ్ బాస్ లో పాల్గొనడం ఇది రెండోసారి. ఇదివరకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని 8వ స్థానంతో వెనుదిరిగింది. ఇక తాజాగా పాల్గొన్న ఓటిటి సీజన్ లో కంటెస్టెంట్ లకు ఎలాంటి పోటీ ఇవ్వనుందో తెలీదు.
కానీ వచ్చిన మొదటి రోజే ముమైత్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఫస్ట్ డే మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చిన ముమైత్.. హౌస్ లో మరో కంటెస్టెంట్ RJ చైతూతో మాట్లాడేటప్పుడు సిగరెట్ తాగుతూ కెమెరా కంటపడింది. ప్రస్తుతం ముమైత్ సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి 84 రోజులపాటు సాగనున్న బిగ్ బాస్ లో ముమైత్ ఎన్ని వారాలు ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Day 1! A fun conversation and a dramatic Turn↩️ Who are they talking about?!🤔#biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/KoWAIflHcW
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 27, 2022