ఎవరి పిచ్చి వారికి ఆనందమని ఊరికే అన్నారా..? ఇదిగో ఇలాంటి మహానుభావులను ఉద్దేశించే ఆ మాట అన్నారు. వైరల్ అవ్వాలనే పిచ్చితో యువత పడేపాట్లు ఇతరులకు కంపరం పుట్టిస్తున్నాయి.
యువతలో పిచ్చి పరాకాష్టకు చేరుతోందడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. నైపుణ్యాన్ని బయటకి తేవడంలో తప్పు లేదు కానీ, నలుగురు నవ్వేలా ప్రవర్తించడమే సిగ్గుచేటు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో టూ పీస్ డ్రెస్‌తో మెట్రోలో యువతి హల్‌చల్ చేసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. బట్టలు వేసుకుంటే బరువన్నట్లుగా.. ఆ అమ్మాయి టూ పీస్ డ్రెస్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ టీనేజర్ వింత ప్రవర్తన నెటిజన్లే కాదు.. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది చాలదన్నట్లు తాజాగా మరో ఇద్దరు యువకులు డెనిమ్ స్కర్ట్ ధరించి మెట్రో ఎక్కారు. ఇంకేముంది.. అందరి అమ్మాయిల కళ్లు వారిమీదే. అందుకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి కాస్త అనువైన దుస్తులు ధరించడం కామన్. ఒకవేళ ఆలా ధరించాలి అనుకున్నారేమో అనుకున్నా.. ఖద్దర్ చొక్కా లుంగీ లేదా పంచె ధరించవచ్చు. కానీ ఇద్దరు యువకులు రీల్స్ పిచ్చితో డెనిమ్ స్కర్ట్స్ ధరించి మెట్రో ఎక్కారు. ఆపై చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా.. అటూ ఇటూ తిరుగుతూ రీల్స్ చేశారు. ఈ తతంగాన్ని చూడలేక అమ్మాయిలు సిగ్గుతో తలదించుకున్నారంటే నమ్మండి. ఈ వీడియోలు చూశాక.. వీరిని పొగిడే వారి సంఖ్య తక్కువే కానీ, తిట్టేవారి సంఖ్య మాత్రం బోలెడు. ‘మగజాతి పరువు తీయడానికే పుట్టారు రా.. మీరు’ అంటూ నెటిజన్స్ వారిని తిట్టిపొడుస్తున్నారు. ఆ అద్భుత దృశ్యాలను మీరూ తిలకించి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
What is wrong with #delhimetro
🙈 #Girls How can you travel like this in #delhimetro 😰#DelhiMetroDiaries #delhi #womenempowement #womensafety #delhipolice #CISF #feminism #feminist #feminists
●Lets see if @OfficialDMRC @DelhiPolice have the guts to ans these ques? pic.twitter.com/IsAabGPJi7— YoursJaskier (@JaskierYours) April 2, 2023