అందరూ గూగుల్ లో జాబ్స్ వెతుకుతూ ఉంటారు. గూగుల్ సంస్థలో జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో విదేశీయులు కూడా ఉంటారు. కానీ జాబ్ కి అప్లై చేయకుండా అయితే ఎవరికీ జాబ్ అనేది రాదు. అప్లై చేయకుండా ఇంటర్వ్యూకే పిలవరు. కానీ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి మాత్రం జాబ్ కి అప్లై చేయకపోయినా సరే ఇంటర్వ్యూకి పిలిచింది. జాబ్ గ్యారంటీ ఇచ్చింది గూగుల్. ఇంతకే ఆ కుర్రాడు చేసిన పనేంటి అంటే?
గూగుల్ కంపెనీయే ఈ కాలేజీ కుర్రాడ్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే ఆ కుర్రాడికి సూటయ్యే ఉద్యోగం సృష్టిస్తామని గూగుల్ తెలిపింది. ఇంతలా గూగుల్ ఆ యువకుడ్ని చూసి ఇంప్రెస్ అయ్యిందంటే మనోడిది మామూలు టాలెంట్ కాదు. గూగుల్ సంస్థలో ఉద్యోగం కొట్టాలని.. కనీసం ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. కానీ కొంతమంది కలలు మాత్రమే నిజమవుతాయి. గూగుల్ లో జాబ్ కొట్టడం కోసం సీవీలు, రెస్యూమేలు పంపిస్తూనే ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారు. అలా అయిన వారే ఇంటర్వ్యూకి వెళ్తారు.
ఇంటర్వ్యూకి వెళ్లిన కొంతమంది మాత్రమే జాబ్ కొడతారు. కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మాత్రం రెస్యూమే పంపలేదు, కనీసం ఇంటర్వ్యూకి అప్లై చేయలేదు. కానీ గూగుల్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అంతేనా అతనికి సూటయ్యే పోస్ట్ ఇస్తామని గూగుల్ తెలిపింది. అతని పేరు అక్షయ్ నరిశెట్టి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ అంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. తన ప్రాజెక్ట్ కోసం గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ లో ఇంటర్నెట్ లేనప్పుడు కనిపించే డినో గేమ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆన్ లైన్ లో కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు. డినో గేమ్ అంటే తెలుసుగా.. ఒక డైనోసర్ ఎదురుగా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి.
కీబోర్డ్ లో స్పేస్ బార్ లేదా డౌన్ ఏరో కీ నొక్కడం ద్వారా అడ్డంకులను దాటుతుంది. అయితే అక్షయ్ చేతులతో కీ బోర్డు టచ్ చేయకుండా డినో గేమ్ దానికదే కంటిన్యూగా ఆడేలా ఒక కోడింగ్ క్రియేట్ చేశాడు. స్పేస్ బార్ కి, ల్యాప్ టాప్ డిస్ప్లేకి కలిపి రెండు వైర్లు సెట్ చేశాడు. ఆ వైర్లను మరొక ల్యాప్ టాప్ కు ఒక డివైజ్ ద్వారా కనెక్ట్ చేశాడు. మొదటి ల్యాప్ టాప్ లో డినో గేమ్ వస్తుంటే.. డైనోసర్ దానికదే ఎగిరేలా రెండవ ల్యాప్ టాప్ లో కోడింగ్ రాసుకొచ్చాడు. కోడింగ్ ఆధారంగా డైనోసర్ అడ్డంకులు వచ్చినప్పుడు ఎగురుతూ ముందుకు పోతుంది. కీబోర్డులో స్పేస్ బార్ నొక్కకుండానే ఈ గేమ్ దానికదే రన్ అవుతోంది. దీన్ని వీడియోగా తీసి తన లింక్డ్ఇన్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అవ్వడంతో గూగుల్ దృష్టిలో పడింది. అంతే గూగుల్ టెక్ హైరింగ్ టీమ్ మెంబర్ ఒకరు అక్షయ్ కి జాబ్ ఆఫర్ ఇచ్చారు. వెంటనే సీవీ పంపండి, మీ కోసం జాబ్ క్రియేట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు.
‘నేను గూగుల్ టెక్ హైరింగ్ టీమ్ లో భాగస్వామిని. మీ డినో గేమ్ ని చూసి ఆశ్చర్యపోయాను. మీరు గనుక గూగుల్ లో కెరీర్ సాగించాలని అనుకుంటే గనుక అప్డేటెడ్ సీవీని మాకు పంపండి. మీకు తగిన జాబ్ ని మీ కోసం నేను కల్పిస్తాను’ అని అక్షయ్ కి గూగుల్ నుంచి ఒక సందేశం వచ్చింది. దీన్ని అక్షయ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ‘ఈ డినో ప్రాజెక్ట్ గూగుల్ లో ఇంటర్వ్యూకి వెళ్లేలా చేసింది’ అంటూ తెలిపాడు. తాను 4వ సెమిస్టర్ లో ఉన్నానని, ఈ ప్రాజెక్ట్ ను లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన అనంతరం గూగుల్ రిక్రూటర్ తనను సంప్రదించారని రాసుకొచ్చాడు. అందరూ జాబ్స్ కోసం గూగుల్ ని వెతుక్కుంటూ వెళ్తుంటే.. ఇతన్ని మాత్రం గూగుల్ వెతుక్కుంటూ వచ్చింది. అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లడం కాదు, అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేసుకోవాలి అని ఈ యువ ఇంజనీర్ నిరూపించాడు. మరి గూగుల్ నుంచి ఇంటర్వ్యూకి పిలిపించుకున్న అక్షయ్ కి అభినందనలు, ఇంటర్వ్యూకి వెళ్తున్నందుకు ఆల్ ద బెస్ట్ చెప్పండి.
I was in my 4th semester and just then after posting this on LinkedIn a recruiter from google reached out. pic.twitter.com/4YpJzOYBZc
— Akshay Narisetti (@AkshayNarisetti) April 27, 2023