ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'మాయాబజార్'. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ.. ఈ సినిమా నాటి నుండి నేటికీ సంచలనమే. గొప్ప కథాకథనాలు.. నటీనటుల పెర్ఫార్మన్స్.. వినసొంపైన సంగీతం.. ఆశ్చర్యపరిచే విజువల్స్.. ఆకట్టుకునే ప్రొడక్షన్ డిజైన్.. దర్శకత్వం.. ఇలా ఒక్కటేమిటి అప్పట్లో మాయాబజార్ క్రియేటివిటీకి గొప్ప నిదర్శనం. 'వివాహ భోజనంబు' పాటలో లడ్డూలు గాల్లో ఎగిరి ఘటోత్కచుడి నోట్లోకి వెళ్లడం అప్పట్లో ఓ సెన్సేషన్.
తెలుగు చిత్రసీమలో శాశ్వతంగా చెరగని ముద్రవేసిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘మాయాబజార్’. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ.. ఈ సినిమా నాటి నుండి నేటికీ సంచలనమే. గొప్ప కథాకథనాలు.. నటీనటుల పెర్ఫార్మన్స్.. వినసొంపైన సంగీతం.. ఆశ్చర్యపరిచే విజువల్స్.. ఆకట్టుకునే ప్రొడక్షన్ డిజైన్.. దర్శకత్వం.. ఇలా ఒక్కటేమిటి అప్పట్లో మాయాబజార్ క్రియేటివిటీకి గొప్ప నిదర్శనం. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేకపోవచ్చు.. కానీ, ఉన్న టెక్నాలజీని పూర్తిగా వాడుకునే నైపుణ్యం.. సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్ లే, ఆర్ట్ డైరెక్టర్స్ గోఖలే – కళాధర్, దర్శకుడు కేవీ రెడ్డిలకు ఉంది.
ఇక మాయాబజార్ మూవీలోని ‘వివాహ భోజనంబు’ పాటలో ఘటోత్కచుడు భోజనానికి ఉపక్రమించి.. నోరు తెరవగానే ప్లేట్ లో ఉన్న లడ్డూలన్నీ నోట్లోకి వెళ్లిపోతాయి. లడ్డూలు గాల్లో ఎగిరి నోట్లోకి వెళ్లడం అనేది అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ సీన్ ఎలా తీశారు? అనేది ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. మరి ఆ లడ్డూల సీన్.. ఆ రోజుల్లో ఎలా షూట్ చేశారో.. ఆర్ట్ డైరెక్టర్ కళాధర్.. పులగం చిన్నారాయణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని తెలుస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే..
లడ్డూలు గాల్లో ఎగిరినట్లు చూపించడానికి ముందుగా ఆర్ట్ డైరెక్టర్స్ గోఖలే – కళాధర్.. ట్రాన్స్ పరెంట్ పేపర్((పారదర్శక కాగితం)తో ఒక గరాటు (ఫన్నల్) రెడీ చేశారు. నటుడు ఎస్వీ రంగారావు కూర్చున్నప్పుడు ప్లేట్ నుండి ఆయన నోటి వరకు గరాటు పొడవు చూసుకొని.. లడ్డూలను కిందకి వదిలారు. అలా కిందికి ప్లేట్ లో పడిన లడ్డూలను.. ఏ ఆధారం లేకుండా కిందికి పడినట్టు షూట్ చేసి.. ఆ షాట్ నే రివర్స్‌లో ప్లే చేశారు. ఆ విధంగా ప్లేట్ లో నుండి నోటిలోకి లడ్డూలు వెళ్తున్నట్లుగా కనిపిస్తుందని ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అంతేగాక ఈ సినిమాలో ఇలాంటి సినిమాటోగ్రాఫర్ బార్ట్ లే, కళాదర్శకులు గోఖలే – కళాధర్, డైరెక్టర్ కేవీ రెడ్డి ప్రయోగాలు చేసిన క్రియేటివ్ సీన్, క్రియేషన్స్ ఎన్నో ఉన్నాయట. చూశారుగా.. టెక్నాలజీ ఈ స్థాయిలో లేనప్పుడే ఎలా అదరగొట్టేశారో! మరి మాయాబజార్ మూవీ గురించి, ఆ సినిమా చుట్టూ అల్లుకున్న మీ జ్ఞాపకాల గురించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.