ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'మాయాబజార్'. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ.. ఈ సినిమా నాటి నుండి నేటికీ సంచలనమే. గొప్ప కథాకథనాలు.. నటీనటుల పెర్ఫార్మన్స్.. వినసొంపైన సంగీతం.. ఆశ్చర్యపరిచే విజువల్స్.. ఆకట్టుకునే ప్రొడక్షన్ డిజైన్.. దర్శకత్వం.. ఇలా ఒక్కటేమిటి అప్పట్లో మాయాబజార్ క్రియేటివిటీకి గొప్ప నిదర్శనం. 'వివాహ భోజనంబు' పాటలో లడ్డూలు గాల్లో ఎగిరి ఘటోత్కచుడి నోట్లోకి వెళ్లడం అప్పట్లో ఓ సెన్సేషన్.
‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీతో పాటుగా దివంగత ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులను కించపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవ్వగా.. తాజాగా ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ విషయంపై స్పందించారు. మాకూ […]