‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్ చేయడంలో బాగానే సక్సెస్ అవుతున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అకట్టుకుంటోంది. ప్రతి విషయానికి టాస్కులు పెట్టడం. వారియర్స్ ఏ అవసరం కావాలన్నా దానికి ఛాలెంజర్స్ పర్మిషన్ కావాలనడం. ఛాలెంజర్స్ కు షో మొదలైనప్పటి నుంచి సీనియర్లే ఒండిపెట్టడం కూడా చాలా గొడవలకు దారి తీస్తోంది. రోజు మొత్తంలో వాళ్లు ప్రశాంతంగా మాట్లాడుకున్న దానికంటే గొడవలు పడటమే ఎక్కువగా ఉంది. వాళ్లళ్లో వాళ్లు గొడవలు పడుతూ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
గేమ్ స్టార్ట్ అయిన రెండో రోజు నుంచి ఆర్జే చైతు- అఖిల్ సార్దక్ మధ్య కోల్డ్ వార్ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బిందు మాధవి- తేజశ్వికి మధ్య మొదలైన గొడవ అటు తిరిగి ఇటు తిరిగి ఆర్జే చైతు- అఖిల్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నేను ఎంత కనెక్ట్ అవుదామని చూస్తున్నా నువ్వే అవాయిడ్ చేస్తున్నాడు.
అందుకు అఖిల్.. నువ్వు ఎప్పుడూ పోక్ చేస్తూనే ఉంటావు. నేను ఎందుకు తీసుకోవాలి.. ఎంతని తీసుకుంటాను. నీ మాటలు చాలు ఇంక అంటూ అఖిల్ కేకలు వేస్తూ వెళ్లిపోతాడు. మాట్లాడొద్దని చెబితే మాట్లడను.. నిన్ను కెలకను. ముందే చెప్పచ్చు కదా అని ఆర్జే చైతు కూడా సీరియస్ అవుతాడు. ఆ విధంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడు అరుపులు ఆరు కేకలతో సాగిపోతోంది. అఖిల్- ఆర్జే చైతు గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.