బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. వారి గొడవలు, టాస్కులు ఇంట్రస్టును క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ప్రతి సీజన్లో కూడా హైస్ పైనుంచి వస్తువులు విసరడం వాటిని ఇంట్లోని సభ్యులు ఏరుకునే టాస్కు కచ్చితంగా ఉంటుంది. అలాగే ఈసారి కూడా ఆ టాస్కును ఆడించారు. ఈసారి లైకుల కోసం కొట్టుకోమని చెప్పారు.
ఇదీ చదవండి: స్టార్ హీరోకి షాక్! కోర్టుకి హాజరు కావాలంటూనోటీసులు!
ఆ టాస్కులో లైకుల కోసం అందరూ ఎగబడుతున్నారు. కష్టపడి ఏరుకుంటుంటే కాజేసినవాళ్లు కూడా ఉన్నారు. అలాగే లైకుల కోసం లాక్కునే క్రమంలో హమీదా పట్టుకోవాలనుకున్న లైకులను నటరాజ్ మాస్టర్, అఖిల్ లాక్కున్నారు. నటరాజ్ మాస్టర్ చెయ్యి పట్టుకుని లాక్కుంటే.. అఖిల్ ఆమె కాలి కింద ఉన్న దానిని లాగేసుకున్నాడు. అప్పుడు హమీదా నువ్వు ఎక్కడ పట్టుకుంటున్నావ్? గట్టిగా అరిచింది. ఆమె తొడ చూపిస్తూ అక్కడ టచ్ చేస్తున్నావ్ అంది. అయితే అఖిల్ షాకైనట్లు ముఖం పెట్టి నిజంగా అలా అంటున్నావా? నేను ఎందుకు పట్టుకున్నాను నేను టచ్ చేయాలా అంటూ వెళ్లిపోతాడు.
ఆ తర్వాత హమీదా దానిని పెద్ద ఇష్యూ చేయలేదు. గత సీజన్లలో సభ్యులు ఉమెన్ కార్డు తీసినట్లుగా ఆమె తీసే ప్రయత్నం చేయలేదు. నన్ను టచ్ చేశావ్ అ ఆరోపించింది. అది నటరాజ్ మాస్టర్ చెయ్యి కావచ్చు, అఖిల్ చెయ్యి కావచ్చు. లేదా అసలు టచ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ తగిలినా కూడా అది గేమ్ లో లైకుల కోసం తాపత్రయంలో జరిగి ఉండచ్చు కానీ, కావాలని చేసుండకపోవచ్చు. ఎందుకంటే 70 కెమెరాలు ఉన్నాయి. అందరూ చూస్తుండగా తనను తాను బ్యాడ్ చేసుకోవాలని ఎవరూ అనుకోరు. అఖిల్ పాత బిగ్ బాస్ లో కూడా అలాంటి ప్రవర్తన చేయలేదు. హమీదా కూడా కోప్పడటానికి కారణం లేకపోలేదు. ఆ ఘటనకు ముందే ఆమె దగ్గరున్న 30 లైక్స్ కోల్పోవడంతో ఆమె ఆవేదనతో అలా ప్రవర్తించి ఉండవచ్చు. ఆ తర్వాత ఆమె గొడవను పెద్దది చేయలేదు. అక్కడ మిస్ అండర్ స్టాండింగ్ మాత్రమే అయ్యి ఉండవచ్చు అని కామెంట్ చేస్తున్నారు. అఖిల్- హమీదా గొడవలో ఎవరిది తప్పు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.