బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ దాదాపు ముగిసినట్లే. ఎన్నో అంచనాలతో ఈ సీజన్ ను స్టార్ట్ చేసినా కూడా ఆశించిన ఫిలతాలు రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అని చెప్పిన తర్వాత రికార్డెడ్ ఫుటేజ్ ప్లే చేయడాన్ని ప్రేక్షకులు సమర్థించలేదు. కంటెస్టెంట్ల విషయానికి వస్తే 17 మంది సభ్యులతో సీజన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 9వ వారంలో బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టాడు. సీజన్ ఆఖరి వారంలోకి చేరుకోవడంలో అసలు బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ విన్నర్ ఎవరు అనే వెతుకులాట మొదలు పెట్టేశారు. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అని లీకుల వీరుల ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
17 మంది సభ్యుల్లో బిందు మాధవి, అఖిల్, శివ, అనీల్, మిత్రా శర్మ, అరియానా బాబా భాస్కర్ ఫినాలో వీక్ లో అడుగు పెట్టారు. వారిలో మొదటి నుంచి అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి అంటూ చెబుతున్నారు. అంతేకాకుండా టైటిల్ రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచినట్లు సమాచారం. నిజానికి అందరూ ఊహించినట్లుగానే ఫలితం వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి బిందు, అఖిల్ స్ట్రాంగ్ ఇంటి సభ్యులని అందరికీ తెలిసిందే. గేమ్, టాస్కుల పరంగానూ వాళ్లిద్దరూ మొదటి నుంచి టాప్ ప్లేస్ లోనే ఉన్నారు. వారి తర్వాత మూడో స్థానంలో యాంకర్ శివ, నాలుగో స్థానంలో అరియానా, ఐదో స్థానంలో మిత్రాశర్మ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: బిందుమాధవిపై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!
Congratulations #BinduMadhavi The First Female Contestant is Going To Lift the trophy In 30 Hours ..
Heartful Congratulations to @thebindumadhavi Garu …
— Adi Reddy Boddu (@adireddyfantasy) May 19, 2022
ప్రస్తుతం వస్తున్న లీకుల ప్రకారం ఇప్పటికే బిగ్ బాస్ ఫినాలే షూటింగ్ కూడా పూర్తయ్యింది అని చెబుతున్నారు. వాటి ఆధారంగానే విన్నర్, రన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ గురించి మొదటి నుంచి అప్ డేట్స్ చెబుతున్న సోషల్ మీడియాలో పేజెస్ సైతం బిందు విన్నర్ అంటూ చెబుతున్నారు. కాకపోతే ఇవన్నీ లీకులు మాత్రమే.. అధికారిక ప్రకటన రావాలంటే ఆదివారం సాయంత్రం కింగ్ నాగార్జున వచ్చి చెప్పాల్సిందే. ఈసారి బిందు మాధవి మాత్రం బిగ్ బాస్ తెలుగులో టైటిల్ కొట్టిన ఆడపులి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ కొట్టిన బిందు మాధవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jr.Ntr ఇంటి ముందు అర్థరాత్రి ఉద్రిక్తత.. అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్!
ఇదీ చదవండి: Jr.NTRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ ఎమోషనల్!