శ్రీసత్య.. బిగ్ బాస్, సీరియల్స్, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవారికి ఆమె సుపరిచితురాలే. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మిస్ విజయవాడ కూడా అయ్యింది. తర్వాత సీరియల్స్ లో అడుగుపెట్టి అదే కెరీర్‌గా మలుచుకుంది. అడపాదడపా సినిమాల్లోనూ కనిపించింది. ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్6లో అభిమానులను అలరిస్తోంది. తన మాటలు, డాన్సులు, అమాయకపు చర్యలతో అందరినీ నవ్విస్తోంది. ఆమెకు చికెన్ అంటే ఎంతో ఇష్టం. 365 రోజులు పెట్టినా తింటుంది. ఏది ఉన్నా లేకపోయినా కూడా తిండి ఉంటే చాలు అని ముఖానే చెప్పేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో వచ్చిన కొత్తలో అంతా ఆమెకు యాటిట్యూడ్ ఎవరితో మాట్లాడదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తర్వాత తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే తాన అలా ఉన్నాని చెప్పింది.
అయితే ఆ ఇబ్బందులు ఏంటి? అలా ఎందుకు చేస్తోంది అనే విషయాలను తర్వాత వెల్లడించింది. అదే అంశంపై శ్రీసత్య తండ్రి కూడా ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “శ్రీ సత్య ఓ కుర్రాడిని ప్రేమించింది. అతను ఒక మోసగాడు. అమ్మాయిలు ఎప్పుడైనా అబ్బాయిని నమ్మేస్తోరా. అబ్బాయిలు అమ్మాయిల్ని నమ్మరు. నేను ఈ విషయం మాత్రం గట్టిగా చెప్తాను. అతను మోసం చేసిన తర్వాత శ్రీ సత్య డీప్‌గా హర్ట్ అయ్యింది. నేను ఒకరోజు ఫామ్ దగ్గర ఉన్నాను. శ్రీ సత్య ఉరేసుకుంది. వాళ్ల అమ్మ చూసి వెంటనే పైకిత్తి కట్ చేసి కిందకు దింపింది. ఆ తర్వాత నా భార్య భయపడిపోయింది. మేము ఎవ్వరం లేకపోతే పిల్ల మళ్లీ ఏం చేసుకుంటుందో అలా ఆలోచించి కొవిడ్ స్టార్టింగ్ సమయంలో నా భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 30 లక్షలు పెట్టి సర్జరీ చేయించాం. 6 నెలల్లో కోలుకుంటుంది అన్నారు. మూడేళ్లు దాటిపోయింది. ఇంకా ఇలాగే ఉంది. తర్వాత సర్జరీ ఫెయిల్ అయ్యిందని చెప్పారు” అంటూ శ్రీసత్య తండ్రి తెలిపారు.
ఇంక బిగ్ బాస్ హౌస్‌లో శ్రీ సత్య పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నేను హౌస్‌లోకి వచ్చింది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఫ్యామిలీని పెంచుకోవాలని కాదు. నేను డబ్బుకోసం వచ్చాను. ఆ డబ్బుకోసమే ఆడతానంటూ తేల్చి చెప్పింది. ఇంక శ్రీ సత్య ఆటలో స్పీడు పెంచేసింది. ఫిజికల్ టాస్కుల్లోనూ గట్టిగా పోటీ ఇస్తోంది. ఇటీవల జరిగిన చేపల టాస్కులో కూడా శ్రీహాన్‌తో కలిసి ఫిజికల్ గా బాగా పోరాడింది. శ్రీహాన్ కెప్టెన్ కూడా అయ్యాడు. మొన్నటి వరకు అర్జున్ కల్యాణ్ రూపంలో శ్రీ సత్యకు మంచి సపోర్ట్ ఉండేది. అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య కోసం చాలానే కష్టపడ్డాడు. కానీ, ఆమె మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసింది. అతను వెళ్లబోయే సమయంలో అసలు బిగ్ బాస్‌లోకి వచ్చిందే శ్రీసత్య వల్ల అని చెప్పి షాకిచ్చాడు.