ఆ హీరోయిన్ బాగా తెలుసు. రెండు సినిమాల్లో లీడ్ రోల్, మరో రెండింటిలో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా ఏడోసారి బ్రేకప్ చెప్పి న్యూస్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
ఆమె ప్రముఖ నటి. నార్త్ లో పుట్టినప్పటికీ.. హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. యాక్టింగ్ తోపాటు గ్లామర్ విషయంలోనూ చాలా పేరు తెచ్చుకుంది. వరసగా పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయిన ఆమె ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అందరూ ఆమె హ్యాపీగా ఉందనుకునే టైంలో.. తన భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది. ఆ తర్వాత మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేసింది. ఇప్పుడు అతడి నుంచి కూడా విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నటి బ్రేకప్స్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కిమ్ శర్మ పేరు చెబితే ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ‘ఖడ్గం’లో హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మగధీర’, ‘ఆంజనేయులు’ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2010లో వచ్చిన ‘యాగం’లో యాక్ట్ చేసింది. నటిగా చేస్తున్న టైంలో దాదాపు ఐదుగురితో వేర్వేరు టైంలో రిలేషన్స్ మెంటైన్ చేసిన కిమ్ శర్మ.. వాళ్లకు బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కెన్యా డ్రగ్ మాఫియా డాన్ అలీపుంజలిని 2010లో పెళ్లి చేసుకుంది. దాదాపు ఆరేళ్లపాటు వీళ్ల బంధం బాగానే ఉంది. కానీ 2016లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.
దీంతో ఆ తర్వాత యాక్టింగ్ ఛాన్సుల కోసం కిమ్ శర్మ ప్రయత్నించిందో లేదో తెలియదు కానీ కొన్నాళ్లకు టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తో పరిచయం ఏర్పడింది. అలా గత రెండు-మూడేళ్ల నుంచి పేస్-కిమ్ శర్మ రిలేషన్ షిప్ లో ఉన్నారు. నేరుగా చెప్పకపోయినప్పటికీ.. పేస్ తో తీసుకున్న ఫొటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. గతేడాది మార్చి 29న 1వ డేటింగ్ వార్షికోత్సవం చేసుకున్నట్లు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈసారి మాత్రం అలాంటి హడావుడి ఏం లేదు. సరికదా పేస్ తో తీసుకున్న ఒక్క ఫొటో తప్పించి, దాదాపు అన్నింటిని ఇన్ స్టా నుంచి తొలగించింది. దీంతో బ్రేకప్ పుకార్లు న్యూస్ లో వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ అసలు విషయం తెలీదు. మొత్తంగా చూసుకుంటే కిమ్ శర్మ.. ఏడుసార్లు బ్రేకప్ చెప్పినట్లే. మరి ఈ విషయమై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.