వారిద్దరూ ఏడేళ్ల నుంచి ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విడిపోలేదు. కానీ వారి ఏడేళ్ల ప్రేమను ఏడు సెకన్లలో విడదీసింది ఒక మాట. ఇంతకు ఏం జరిగింది అంటే..
ప్రేమ అంటే చాలా పవిత్రమైందిగా భావిస్తారు. అయితే నేటి కాలంలో కొందరు యువత తమ అవసరాలు తీర్చుకోవడం కోసం వ్యామోహానికి ప్రేమ అనే పేరు పెట్టి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు స్వార్థపరులు ప్రేమ పేరుతో దగ్గరయ్యి.. శారీరంగా వాడుకుని.. ఆఖరికి పెళ్లికి నో చెప్తున్నారు. నేటి కాలంలో చదువుకునే రోజుల్లో ప్రేమ పేరుతో వెంటపడటం.. కాదంటే చంపడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు. ఒకవేళ ప్రేమకు ఎస్ చెప్తే.. చెట్టాపట్టాలేసుకొని తిరగటం.. శారీరక అవసరాలు తీర్చుకోవడం.. ఆపై పెళ్లి ప్రస్తావన తెస్తే.. మెుహం చాటేస్తున్నారు మరి కొందరు. ఇలాంటి వారి గురించి రోజు చదువుతూనే ఉన్నాం. కొందరు తమను మోసం చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెబితే.. కొందరు యువతీయువకులు మాత్రం.. ప్రేమలో మోసపోతే.. ప్రాణాలే తీసుకుంటున్నారు. తాజాగా.. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఏడేళ్లు ప్రేమ పేరుతో కలిసి తిరిగారు. తీరా పెళ్లి చేసుకోమంటే.. అందుకు నిరాకరించాడు ప్రియుడు. దాంతో ఆ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్, నవీపేట మండల కేంద్రానికి చెందిన హరిణి (25) అదే గ్రామానికి చెందిన అక్తర్ అనే యువకుడిని ప్రేమించింది. ఏడేళ్ల క్రితం వీరి మధ్య ప్రేమ చిగురించగా.. అప్పటి నుంచి చెట్టాపట్టాలేసుకొని తిరాగారు. అయితే ఇటీవల కాలంలో హరిణి పెళ్లి విషయమై అక్తర్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అక్తర్ మాత్రం పెళ్లి ప్రస్తావన రాగానే.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన హరిణి.. రెండ్రోజుల క్రితం పెళ్లి గురించి అక్తర్‌ను గట్టిగా నిలదీసింది. అతడు.. హరిణిని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. అక్తర్ మాటలతో హరిణి మనసు ముక్కలయ్యింది. ఏడేళ్ల పాటు ప్రాణంగా ప్రేమిస్తే.. ఇప్పుడా వ్యక్తి.. తనను కాదనడాన్ని హరిణి జీర్ణించుకోలేకపోయింది. ప్రేమ విఫలం అయిన తర్వాత తాను బతికుండి వ్యర్థం అని భావించింది.
ఈ క్రమంలోనే ఆదివారం (మే21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గది తలుపులు పెట్టి ఉండటాన్ని గమనించారు. ఎంత పిలిచినా హరిణి పలకకపోవటంతో వారిలో భయం మొదలయ్యింది. వెంటనే గది తలుపులు పగులగొట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కుప్ప కూలిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఫ్యాన్‌కు వేలాడుతుండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. తెరుకుని.. హరిణిని కిందకు దించి చూడగా… అప్పటికే ఆమె మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు నవీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.