గిల్-సారా మరోసారి వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈసారి వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే న్యూస్ బయటకొచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఏంటి సంగతి? తెలియాలా ఈ స్టోరీ చదివేయండి.
టీమిండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ పేరు చెప్పగానే క్లాస్ అండ్ కూల్ బ్యాటింగ్ గుర్తొస్తుంది. కొందరికి మాత్రం సారా పాప గుర్తొస్తుంది. వీళ్లిద్దరి మధ్య ఏముందో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ తెలియదు. కానీ సమ్థింగ్ సమ్థింగ్ అని మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు. గిల్ కి సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా తెలుసు. ఈమె కలిసి చాలాసార్లు బయట కనిపించాడు కూడా. అలాంటిది వీళ్లిద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నారట. ఆ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా నెటిజన్స్ బయటపెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్ బిజీలో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ముంబయితో క్వాలిఫయర్-2కి రెడీ అయిపోయాడు. ఇలాంటి టైంలో గిల్ బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది. నటి సారా అలీఖాన్ తో విడిపోయాడని మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయిలో డిన్నర్ చేస్తూ మీడియా కంటపడిన ఈ జంట, విమానంలో కలిసి ప్రయాణించారు. దీంతో వీరి గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకున్నారు. ఓసారి ఇంటర్వ్యూలోనూ సారాతో డేటింగ్ చేస్తున్నారా అని అడగ్గా.. అయ్యిండొచ్చు అని ఇన్ డైరెక్ట్ గా యస్ అని చెప్పాడు.
అలాంటిది ఇప్పుడు గిల్-సారా అలీఖాన్ ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ విషయం అటు క్రికెట్, ఇటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మనస్పర్థలు ఏమైనా వచ్చాయా? అసలు ఇంతకీ ఏమైంది? అని పెద్ద డిస్కషన్ జరుగుతోంది. నిజానికి సచిన్ కూతురు సారాతో గిల్ ఫస్ట్ ప్రేమలో ఉన్నాడట. హీరోయిన్ సారా కోసం ఆమెని వదిలేశాడట. మరి గిల్ లైఫ్ లోకి కొత్తగా ఎవరైనా వచ్చారా? లేదంటే త్వరలో వస్తారా అనేది చూడాలి. మరి గిల్-సారా అలీఖాన్ అన్ ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అని వస్తున్న వార్తలపై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.