బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇంట్లో జనాలు తగ్గే కొద్దీ కాస్త ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ సీజన్ ఎంతో నెగెటివిటీని మూటకట్టుకుంది. అంతేకాకుండా రేటింగ్ గానీ, రీచ్ గానీ అస్సలు లేదు అంటా చాలానే వార్తలు వచ్చాయి. సీజన్ మొదలైనప్పటి నుంచి నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. మీరు ఆట ఆడితే ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా వాచ్ చేస్తారు అని. అంటే వాళ్లు ఆట సరిగ్గా ఆడటం లేదని వాళ్లే ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ సీజన్లో ఎప్పుడూ లేనివిధంగా ప్రైజ్ మనీలో కోతలు చాలా పెడుతున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల వరకు కోసేశారు. లాస్ట్ లో మళ్లీ సిల్వర్ సూట్‌కేస్ అంటూ మరో రూ.10 లక్షల్ని ఇంట్లోకి పంపిస్తారు. ఇలా చూసుకుంటే ఈసారి విన్నర్ అయినా పెద్దగా ఒరిగేదీ ఏమీ ఉండదనే చెప్పాలి.
ఇంక ఈ సీజన్లో అయితే రియల్ కపుల్ తప్ప మరే రీల్ కపుల్ లేరు. మొదట్లే వాళ్ల మధ్య వీళ్ల మధ్య ఏవో రిలేషన్స్ ఉన్నాయి అనుకున్నా అవి వర్కౌట్ కాలేదు. ఇనయాకి సూర్యకి మధ్య రిలేషన్ బిల్డ్ అయ్యింది అని ప్రేక్షకులు అనుకునేలోపే మనోడు ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఉన్న వాళ్లలో కాస్త క్లోజ్‌గా ఉంటోంది శ్రీసత్య, శ్రీహాన్ మాత్రమే. వాళ్లే ఎప్పుడూ కలిసి కనిపించడం కలిసి గేమ్ ఆడటం చేస్తున్నారు. అయితే వాళ్లది ఫ్రెండ్షిప్ మాత్రమే అని వాళ్లు కూడా చెబుతున్నారు. అయితే శుక్రవారం వదిలిన ప్రోమోలో అయితే కాసేపు బీజీఎంలు వేసేసి వారి మధ్య ఏదో ఉంది అని ప్రేక్షకులు భావించేలా ప్లాన్ చేశారు. అయితే అసలు ఎపిసోడ్ చూస్తే అక్కడ ఏమీ లేదు. నిజానికి శ్రీహాన్.. శ్రీసత్యతో పాటుగా రేవంత్ గురించి కూడా మాట్లాడాడు.
కానీ, ప్రోమోలో కేవలం శ్రీసత్య గురించి మాత్రమే మాట్లాడటాన్ని చూపించారు. నువ్వు ఒక్క వారం ఉంటావు అంటే నా ప్రైజ్ మనీ నుంచి లక్ష కట్ చేస్తారు అన్నా కూడా నాకు ఓకే.. నువ్వు నాతో ఉంటావుగా అని చెప్పిన మాటలను చూపించారు. ఆ తర్వాత ఫుల్ వీడియో చూశాక అసలు విషయం అర్థమవుతుంది. నువ్వు గానీ, రేవంత్ గానీ ఇంకో వారం నాతో ఈ హౌస్‌లో ఉంటారు అని తెలిస్తే.. నేను కచ్చితంగా అంత ఖర్చు చేస్తాను. అదేగా ఫ్రెండ్షిప్ అంటే అని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన సిరి.. “అయితే ఈ వీడియో వల్ల ఎవరు ఏంటంటే మా వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్నారు. నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. మీరు ప్రోమోని చూసి నమ్మేయకండి. అసలు వీడియో వచ్చేదాకా ఏదీ ఫిక్స్ కాకండి అని. చివరికి అదే జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీహాన్ ఆల్వేస్ సపోర్ట్స్ ఫ్రెండ్షిప్. లవ్ యూ కన్నా” అంటూ కామెంట్ చేసింది.