తెలుగు రియాలిటీ షోల్లో బిగ్ బాస్ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తవగా.. ఈ ఏడాది ఓటీటీలోనూ నాన్ స్టాప్ పేరుతో 24 గంటలూ షో టెలికాస్ట్ చేశారు. అది అనుకున్నంత క్లిక్ కాలేదు. ఇప్పుడు మళ్లీ యధావిధిగా టీవీలో ఆరో సీజన్ ప్రారంభించేశారు. 21 మంది సభ్యులు హౌస్ లో అడుగుపెట్టేశారు కూడా. ఇలా భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ షోపై ఇప్పుడు సింగర్ స్మిత షాకింగ్ కామెంట్స్ చేశారు. చచ్చినా సరే బిగ్ బాస్ కి వెళ్లనని తెగేసి చెప్పింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ తెలుగు షోపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండగా… మరికొందరు మాత్రం.. ఆసక్తి చూపించరు. అలాంటి వారిలో సింగర్ స్మిత ఒకరు. స్వయంగా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘నాకు ఈ కార్యక్రమం ఏ మాత్రం నచ్చదు. అందరిని లోపలకు పంపించి లాక్ చేసి గొడవపడమని ఆదేశించడం ఏంటో నాకు అర్థం కాదు. నేను వెళ్లడమే కాకుండా నాకు బాగా సన్నిహితులైన పరిచయం ఉన్నవారు ఈ కార్యక్రమానికి వెళ్తానని చెప్పినా సరే వద్దనే సలహా ఇస్తాను. ఈ షోలోకి వెళ్లిన వారిని నేను విమర్శిస్తున్నానని కాదు కానీ ఎందుకో ఇందులోకి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు’ అని స్మిత కుండబద్ధలు కొట్టేశారు.
ఇకపోతే ఈసారి బిగ్ బాస్ లో అడుగుపెట్టిన వారిలో రేవంత్, ఫైమా, చంటి, సూర్య, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి తదితరులపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మిగతా వారిని కూడా తక్కువ చేయలేం. ఎందుకంటే ఎవరు ఎప్పుడు క్రేజ్ పెంచేసుకుంటారో చెప్పలేం. అలానే ఈసారి టీవీలో రాత్రి 10-11 మధ్య షో ప్రసారమవుతుంది. అలానే ఓటీటీలోనూ 24 గంటలూ చూసే వీలుంది. ఈసారి సరికొత్తగా ఆ సదుపాయాన్ని కల్పించారు. ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రైజ్ మనీ ఎంత.. హౌస్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ ఎవరికంటే!