ఇంగ్లీష్‌లో ప్రారంభం అయ్యి.. ఇండియాలో తొలుత హిందీలో స్టార్ట్ అయి.. ప్రస్తుతం అన్ని భాషల్లో మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్‌బాస్. ఇక తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకుని.. ఆదివారం (సెప్టెంబర్ 4) సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదో సీజన్ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీ 24 కూడా వచ్చింది. ఇక సీజన్ 6లో భాగంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఇక బిగ్‌బాస్ షో ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే భారీ ఎత్తున హంగామా మొదలవుతుంది. ఇక బిగ్‌బాస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. కంటెస్టెంట్ల లిస్ట్ మాత్రం లీకవుతూనే ఉంటుంది. ఈ సారి కూడా లీకైన లిస్ట్‌లో ఉన్నవారే హౌస్‌లోకి వెళ్లడం గమనార్హం. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు.. ఆ అవకాశం కోసం ఎంతో మంది ఆత్రుతతగా ఎదరు చూస్తారు. బిగ్‌బాస్ నుంచి పిలుపు వస్తే చాలు.. అప్పటి వరకు చేస్తున్న సీరియల్స్, షోలను వదులుకుని బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సిద్ధపడతారు. ఈ షో ద్వారా లభించే క్రేజ్ అలా ఉంటుంది మరి. ప్రతి కంటెస్టెంట్‌కి ఓ రేంజ్లో అభిమానులు తయారవుతారు. ఇక పాపులారిటితో పాటు.. హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు పారితోషికం లభిస్తుంది. ఇక విన్నర్‌కు ఈ రెమ్యూనరేషన్‌తో పాటు ఏకంగా 50 లక్షల వరకు ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ వారి పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. బాగా ఫేమ్ ఉన్నవారికి వారానికి ఏకంగా లక్షల్లో కూడా రెమ్యూనరేషన్ లభిస్తుంది. ‘బిగ్ బాస్’ హౌస్‌లో చివరి వరకు ఉండి టైటిల్ గెలిచేవారికి ఇప్పటివరకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తూ వస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా అంతే మొత్తం ఉండనున్నట్లు సమాచారం. ఇక విన్నర్‌కి ప్రైజ్ మనీతో పాటు ప్రతి వారం రెమ్యూనరేషన్ లభిస్తుంది. ఇక విన్నర్ సంగతి పక్కన పెడితే.. హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కి వారానికి చెల్లింపులు ఉంటాయి. అది వారి ఫేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక కంటెస్టెంట్లకు ప్రతి వారం రూ.3 లక్షల నుంచి 80 వేలుకు తగ్గకుండా చెల్లింపులు ఉంటాయని సమాచారం. బాగా పాపులారిటి ఉన్న కంటెస్టెంట్లకి అత్యధికంగా వారానికి 3 లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునకు సీజన్ పూర్తి అయ్యే వరకు భారీ మొతం ఇస్తున్నారని సమాచారం. సీజన్ 6 కోసం నాగార్జునకు ఏకంగా 12 కోట్లు నుంచి రూ.15 కోట్లు వరకు చెల్లిస్తున్నట్లు టాక్. గత సీజన్ వరకు నాగార్జునకు రూ.8 కోట్ల వరకు ఇచ్చేవారని సమాచారం. అయితే సీజన్-5, ఓటీటీ ‘బిగ్ బాస్- నాన్ స్టాప్’కు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ అవి నిజమైతే.. ఈ సీజన్‌కు నాగ్ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీ బిగ్‌బాస్ షో కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.350 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. కాకపోతే అక్కడ వచ్చే రేటింగ్ కూడా భారీగానే ఉంటుంది. హిందీ బిగ్‌బాస్ మరీ బోల్డ్‌గా ఉంటుంది. మరి ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో బెడ్స్ కావాలనే తగ్గించారా? మాస్టర్ ప్లాన్ లీక్! ఇది కూడా చదవండి: సింగర్ రేవంత్ ‘బిగ్ బాస్ 6’ టైటిల్ విన్ అవుతాడా?