తెలుగులో టాక్ షోల ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. కొన్నేళ్ల ముందు వరకు యాంకర్స్ షోలను హోస్ట్ చేసేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో అలీ, సమంత, బాలకృష్ణ లాంటి స్టార్స్.. టాక్ షోలకు హోస్టులుగా మారిపోయారు. తమ వాక్చాతుర్యంతో ఫుల్ గా ఎంటర్ టైన్ చేశారు. అయితే ‘అన్ స్టాపబుల్’, ‘సామ్ జామ్’, ‘అలీతో సరదగా’ ఇలా ఎన్నో షోలను మనం చూశాం. కానీ ఇప్పుడు వాటికి మించి అనేలా కొత్త టాక్ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.
ఇక విషయానికొస్తే.. ప్రస్తుతం ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. అలా ఓటీటీలో వచ్చిన ‘అన్ స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అంతకు మించిన కంటెంట్ తో తెలుగు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేయడానికి సింగర్ స్మిత రాబోతుంది. ‘నిజం విత్ స్మిత’ పేరుతో సోనీ లివ్ లో ఫిబ్రవరి 10 నుంచి కొత్త టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. దీనికి స్మిత హోస్ట్. నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాని, అడివి శేష్, రాధిక, సాయిపల్లవి, అనిల్ రావిపూడి, అల్లరి నరేష్ లాంటి చాలామంది స్టార్స్.. తాజాగా రిలీజైన ప్రోమోలో కనిపించడం విశేషం.
అయితే సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజైన ఈ ప్రోమో.. తెలుగు ఆడియెన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. ఇదేమి షోరా బాబు అనుకునేలా చేస్తోంది. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని స్మిత.. వెన్నుపోటు టాపిక్ గురించి అడగ్గా.. ‘కేసీఆర్ కూడా భాగమే’ అని చంద్రబాబు అన్నట్లు చూపించారు. అయితే ఈ రెండూ కూడా ఒకే ప్రశ్న గురించి మాట్లాడుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అలానే చిరంజీవి తనకు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘సినిమాలో నటిద్దామనా? నీ కులమేంటి?’ అని కొందరు హేళన చేసినట్లు గుర్తుచేశారు. వీటితోపాటు నాని కూడా నెపోటిజం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి షో పేరుకు తగ్గట్లే షోలోని సెలబ్రిటీలందరూ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పినట్లు కనిపిస్తుంది. మరి ఈ టాక్ షో ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి? మరి ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.