కొన్నాళ్లుగా సింగర్ గా స్మిత పేరు బిగ్ స్క్రీన్ పై పెద్దగా కనిపించట్లేదు. కానీ.. బుల్లితెరపై వివిధ టాలెంట్ షోస్ లో జడ్జిగా పాల్గొంటూ ప్రేక్షకులతో టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలో తన భర్త గురించి, పెళ్లి గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
సింగర్ స్మిత గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సింగర్ గానే కాకుండా నటిగా, బిజినెస్ విమెన్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా.. ఎప్పుడూ దేని సమయం దానికే కేటాయిస్తూ లైఫ్ ని ఎంతో ఆదర్శంగా లీడ్ చేస్తోంది. విజయవాడలో పుట్టిపెరిగిన స్మిత.. మొదటగా హైరబ్బా, మసక మసక చీకటిలో.. లాంటి పాప్ సాంగ్స్ తో సింగర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్లేబ్యాక్ సింగర్ అయ్యాక అనుకోకుండా ఒకరోజు, ఆట, ఛత్రపతి.. ఇలా మరెన్నో సినిమాలలో పాపులర్ సాంగ్స్ పాడింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్మిత.. నటిగా మల్లీశ్వరీ, ఆట లాంటి సినిమాలలో మెరిసింది.
ఇక కొన్నాళ్లుగా సింగర్ గా స్మిత పేరు బిగ్ స్క్రీన్ పై పెద్దగా కనిపించట్లేదు. కానీ.. బుల్లితెరపై వివిధ టాలెంట్ షోస్ లో జడ్జిగా పాల్గొంటూ ప్రేక్షకులతో టచ్ లో ఉంటోంది. ఓవైపు టీవీ షోస్ తో పాటు తన మిగతా సమయాన్ని ఫ్యామిలీ, బిజినెస్ లకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో సడెన్ గా ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోతో అందరినీ సర్ప్రైజ్ చేసింది. పైగా టాక్ షో నుండి చిరంజీవి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇలా హేమాహేమీలతో ప్రోమో రిలీజ్ చేసి షాకిచ్చింది. ఈ టాక్ షో సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. స్మిత తాజాగా సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్, పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది.
ఈ క్రమంలో స్మిత తన భర్త గురించి, పెళ్లి గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. మీది లవ్ మ్యారేజ్ కదా? మీ విషయాలలో హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “నా విషయంలో హస్బెండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నా వాయిస్ కి మా ఆయన పెద్ద ఫ్యాన్. ఆయన పేరు శశాంక్. మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే.. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ లో ఆయన కూడా ఒకరు. మా ఫ్రెండ్స్ అంతా ఆయన్ని బావ అంటారు. నేను కూడా అంతే. అయితే.. మా మ్యారేజ్ అప్పటికీ నా వయసు 21 ఏళ్ళు. మా లవ్ మేటర్ అక్కినేని వెంకట్(నాగార్జునకి అన్నయ్య)గారు దగ్గరుండి సెట్ చేశారు. మా రెండు ఫ్యామిలీస్ తో ఆయనే మాట్లాడి ఒప్పించారు. మాకిప్పుడు పాప శివి.” అని తెలిపారు స్మిత. ప్రస్తుతం స్మిత మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి స్మిత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.