బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఇంగ్లీష్ లో మొదలైన ఈ షో మనదేశంలో తొలిసారిగా హిందీలో ప్రారంభమైంది. అక్కడ మంచి విజయం సాధించింది.. ఇతర భాషాల్లో కూడా కూడా ప్రసారమవుతోంది. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో ఆదరణ బాగా ఉంది. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్ల విజయవంతగా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎంతో అట్టహాసంగా ఒక్కసారిగా 21 మందికి ఇంట్లోకి పంపడంతో అంతా రచ్చ రచ్చగా మారిపోయింది.
బిగ్ బాస్-6 లో బుల్లితెర, వెండి తెర నటీనటులతో పాటు యాంకర్లు, యూట్యాబ్ స్టార్లు కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌస్ సభ్యులందరు ఎవరి స్ట్రాటజీతో వాళ్లు ముందుకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ షో ప్రారంభమై వారం కూడా గడవక ముందే.. టైటిల్ విన్నర్ అంటూ ఓ సీరియల్ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం.. బిగ్ బాస్-6 టైటిల్ ని గెలిచేది.. బుల్లితెర నటి కీర్తి భట్ అంటా. ఈ పేరు అందరికి పరిచయం లేకపోవచ్చు..కానీ కార్తీక దీపంలో హిమ అంటే అందరు గుర్తుపడతారు. కీర్తి భట్..కార్తీక దీపంలో హిమ పెద్దగా మారిన తరువాత పాత్రలో నటించింది. కార్తీకదీపం ద్వారా కీర్తి.. ప్రేక్షకులకు దగ్గర అవ్వగా. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ఇంకాస్త దగ్గర అయింది. ఇక కీర్తి భట్ అప్పుడే టైటిల్ విజేత అంటూ మరో బుల్లితెర నటి ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంక జైన్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం. మొదట ‘మౌనరాగం, సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సీరియల్ తో కూడా ప్రియాంక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నటి సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా బిగ్ బాస్-6 సభ్యురాలు కీర్తి భట్ గురించి ఓ పోస్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి కీర్తి వెళ్లడం చాలా గర్వంగా ఉందంటూ పొగిడేసింది. అంతేకాకుండా బిగ్ బాస్-6 టైటిల్ ని గెలిచేది తనే అంటూ కూడా ఒక కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో బిగ్ బాస్ 6 ప్రారంభమై ఒక వారం కూడా కాలేదు..అప్పుడే టైటిల్ విన్నర్ అని ఎలా చెబుతున్నావు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.