జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలపై ప్రేమను చూపిస్తూ వాటితో సరదాగా ఆడుకుంటారు. కొందరైతే శునకానికి ముద్దులు పెడుతూ వాటిపై ప్రేమను చూపిస్తారు. ఇదే రీతిలో ఓ నటి తన పెంపుడు శునకానికి ముద్దులు పెడుతూ, దానితో ముద్దులు పెట్టించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెంపుడు జంతువులతో బంధం పెంచుకున్నవారు వాటిపై అమితమైన ప్రేమను చూపిస్తారు. శునకాన్ని ఎక్కువగా ఇళ్లల్లో పెంచుకుంటూ ఒక కుటుంబసభ్యుని మాదిరిగా దాని పట్ల వ్యవహరిస్తారు. మంచి ఆహారాన్ని అందించడం, దానికి జబ్బు చేస్తే ట్రీట్ మెంట్ చేయించడం చేస్తారు. ధనంవతులైతే లక్షలు పోసి మరి పెంపుడు శునకాలను కొనుగోలు చేస్తారు. అయితే ఓ నటి తన పెంపుడు శునకంతో ముద్దులాడి, ఆ శునకాన్ని ఎత్తుకుని ఆడించిన వీడియో ఒకటి ఇన్స్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
విశ్వాసానికి మారుపేరు అయిన శునకాన్ని పెంపుడు జంతువుగా పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. పెంపుడు శునకంతో సరదాగా ఆడుకోవడం మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఓ సీరియల్ హీరోయిన్ శునకాన్ని ముద్దాడుతూ, అమాంతం ఎత్తుకుని దానిపై ప్రేమ చూపిస్తూ గిరిగిరా తిప్పింది. ఆ శునకం కూడా దాని నాలుకతో ఆమెను ముద్దాడుతూ ఉండిపోయింది. శునకాలతో చుంబనాలు పలు రకాల వ్యాధులు కలుగజేస్తాయని డాక్టర్లు చెప్పినప్పటికి డాగ్ లవర్స్ ఏమాత్రం లెక్కచేయరు. ఈ క్రమంలో .జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ తన పెంపుడు కుక్కపై ముద్దుల వర్షం కురిపించింది.
జంతు ప్రేమికురాలైన ప్రియాంక జైన్ తన పెంపుడు శునకంపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. మొదటగా ప్రియాంక వద్దకు వచ్చిన శునకం దాని నాలుకతో చెంపలు, మెడపై, పెదాలపై నాకుతూ ఉండసాగింది. ఆ తరువాత ప్రియాంక జైన్ ఆ శునకాన్ని అమాంతం ఎత్తుకుంది. దానికి ముద్దులు పెడుతూ.. గిరగిరమని తిప్పేసింది. కాగా ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు నవ్వులు పూయించే కామెంట్లు చేస్తున్నారు. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది అని అంటుంటారు అది ఇదేనేమో అని ఒకరు, కుక్కతో నాకించుకోవడం ఏంటని ఒకరు, కుక్క స్థానంలో నేనుంటే ఎత బాగుండో అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.