సినిమాలు, సీరియల్స్ నటీనటులంతా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సందడి చేస్తున్నారు. వ్యూస్, ప్రమోషన్ల ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి ఏ వీడియో పడితే ఆ వీడియో చేస్తున్నారు. తాజాగా ఓ నటి తిరుపతి వెళ్లగా.. చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని తన యూట్యూబ్ ఖాతాలో వెల్లడించింది.
సోషల్ మీడియా పుణ్యమానీ సెలబ్రిటీలు రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ నటీనటులంతా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సందడి చేస్తున్నారు. వ్యూస్, ప్రమోషన్ల ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నారు. షూటింగ్ టైమ్స్ నుండి బెడ్ టైమ్స్ వరకు ప్రతిదీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిలో పోస్టు చేస్తున్నారు. వీటి ద్వారా ఫాలోవర్సును పెంచుకోవడమే కాదూ కాసులకు వారి ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. కాసుల కోసం హోమ్ టూరు, కిచెన్ టూరుతో పాటు ఏకంగా ఫ్రిజ్ టూర్ అంటూ నానా హడావుడి చేస్తున్నారు. వీటితో పాటు షాపింగులు, షికార్లకు సంబంధించిన వీడియోల గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కొక్కసారి వీరి చేస్తున్న వీడియోలు నిజమో, ఫ్రాంకులే కూడా తెలియడం లేదు. అయితే వ్యూస్ కోసం ఏదీ పడితే అది చేస్తున్నారు. తాజాగా ఓ నటి అటువంటి వీడియో చేసి పెద్ద గొడవ అని పెట్టింది. తీరా చూస్తే..
జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక జైన్ ఇటీవల ఒంటిమిట్ట, తిరుపతికి వెళ్లింది. అయితే ఆ బ్లాగ్‌కు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పెట్టింది. అయితే తిరుపతి వెంకన్న దేవాలయంలో ఆమెకు ఓ మహిళ నుండి చేదు అనుభవం ఎదురౌన్నట్లు కలరింగ్ ఇచ్చింది. ‘నేను దర్శనం చేసుకుని పద్మావతి టెంపుల్ దగ్గర నిలబడి ఉన్నాను.. ఎవరో ఒకామె నాపై ఊరికే గట్టిగా అరిచింది. ఇది ఎంతవరకూ కరెక్టో మీరే ఆలోచించండి. మనుషులతో మాట్లాడటం కూడా వేస్ట్ అనుకున్నా. ఇలాంటి మనషులతో మాట్లాడటం కూడా వేస్ట్ అనుకున్నా. మీతో చెప్పాలనుకున్నా.. చాలా పెద్ద గొడవ అయ్యింది.. చాలామంది వచ్చేశారు’అంటూ తన సీరియల్ నటనను బయటపెట్టింది ప్రియాంక జైన్. తనకి ఏదో జరగకూడని నష్టం జరిగిపోయినట్టుగా తెగ ఫీల్ అయిపోతూ.. తిరుపతిలో ఫైట్ అంటూ ఈ వీడియోకి ట్యాగ్స్ ఇచ్చేసింది ప్రియాంక.
చివరకు ఏం జరిగిందో వీడియో ఆఖరులో ఆ విషయాన్ని రివీల్ చేసింది. పద్మావతి టెంపుల్ వద్దకు వచ్చిన ఆమె.. పూజ కోసం వెళుతూ ఫోన్లకు లోపలికి అనుమతి లేదని చెబుతూ.. బయటకు వచ్చాక..తనకేదో నష్టం జరిగినట్లు చెప్పింది. తాను దర్శనం చేసుకుని పద్మావతి టెంపుల్ దగ్గర నిలబడి ఉన్నానని, తనపై ఒకామె ఊరికే గట్టిగా అరుస్తుందని అసలు విషయం రివీల్ చేశారు. ‘ కొనేముందు రేటు అడుగుతారు ఎవరైనా.. రేటు అడిగినందుకు గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది.. అలా అరవడం నాకు అస్సలు నచ్చలేదు. ఇలాంటి మనషులతో మాట్లాడటం కూడా వేస్ట్ అనుకున్నా. చాలా పెద్ద గొడవ అయ్యింది.. చాలామంది వచ్చేశారు.. పెద్దవాళ్లు రెస్పెక్ట్ తీసుకోవాలని అనుకుంటారు కానీ.. ఇవ్వడం మర్చిపోతారు. ఇది చాలా విచారకరం.. నాకు నచ్చడం లేదు’అంటూ తర్వాత షాపింగ్ చేసేసింది. అయితే ఈ వీడియో చూసిన వారంతా ఇదీ గొడవనా అని కామెంట్లు పెడుతున్నారు.