బిగ్ బాస్ 7లోకి 'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త అమర్ దీప్ కు సైతం తెలియడంతో.. ఈ న్యూస్ పై అతడు తాజాగా స్పందించాడు.
బుల్లితెర ప్రేక్షకులను గత ఆరు సీజన్లుగా అలరిస్తున్న షో బిగ్ బాస్. ఇప్పటికే విజయవంతగా 6 సీజన్లను పూర్తి చేసుకుని త్వరలో 7వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది ఈషో. ఇక ఇప్పటి నుంచే బిగ్ బాస్ -7లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో హౌజ్ లోకి రష్మీ, సుధీర్ లతో పాటుగా మరికొంత మంది సెలబ్రిటీలు వస్తారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో బుల్లితెర హీరో సైతం బిగ్ బాస్ 7లో ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్ దీప్ బిగ్ బాస్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అమర్ దీప్ చౌదరి.. బుల్లితెర అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అదీకాక టీవీ ఆడియన్స్ లో అమర్ దీప్ కు చిన్నపాటి హీరోకు ఉన్న ఫాలోయింగ్ ఉంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ ద్వారా అమర్ దీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఈ సీరియల్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అమర్ దీప్ కు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అమర్ దీప్ బిగ్ బాస్ 7లోకి అడుగుపెడుతున్నాడని టాక్ నడుస్తోంది. దాంతో సీరియల్ పరిస్థితి ఏంటి? అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే తాను బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించాడు అమర్ దీప్.
అతడు మాట్లాడుతూ..”నేను బిగ్ బాస్ 7కి వెళ్తున్నాను అన్న వార్త విన్నాను. అయితే నాకు సీరియల్ ఉంది. కానీ బిగ్ బాస్ కు పంపించడం అనే మా ఛానల్ ఇష్టం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం, ఆ టైమ్ కు ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం కదా” అంటూ చెప్పుకొచ్చాడు అమర్ దీప్. ఇతడితో పాటుగా తన భార్య తేజస్విని గౌడను కూడా బిగ్ బాస్ 7లోకి పంపుతారని సమాచారం. కపుల్స్ విభాగంలో వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే తేజస్విని బిగ్ బాస్ 7లోకి రాదు అని స్పష్టం చేశాడు అమర్ దీప్. అయితే ఒకవేళ అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే మరి జానకి కలగనలేదు సీరియల్ పరిస్థితి ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ క్రమంలోనే ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో బిగ్ బాస్ 7 హడావిడి మెుదలయ్యే సరికి అమర్ దీప్ ఫ్రీ అవుతాడు అని తెలుస్తోంది. మరి అమర్ దీప్ బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.