'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదీ కాక అమర్ దీప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ రీతూ చౌదరితో కలిసి నడిరోడ్డుపై చేసిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరో అమర్ దీప్ కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక అమర్ దీప్ సీరియల్స్ తో పాటుగా కొన్ని వెబ్ సిరీస్ లు, అడపాదడప సినిమాల్లో నటిస్తు.. బిజీగా ఉన్నాడు. అదీ కాక అమర్ దీప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా రీల్స్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా అతడు చేసిన ఓ రీల్ లో జబర్దస్త్ రీతూ చౌదరి కనిపించి రచ్చ రచ్చ చేసింది. వీరిద్దరు కలిసి అర్దరాత్రి నడిరోడ్డుపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అమర్ దీప్.. ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరోగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ చేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. ట్రెండింగ్ లో ఉంటూంటాడు. తనదైన ఫన్నీ రీల్స్ తో అలరిస్తుంటాడు అమర్ దీప్. ఇప్పుడు అమర్ దీప్ కు తోడుగా జబర్దస్త్ రీతూ చౌదరి జత కలిసింది. తాజాగా వీరిద్దరు నడిరోడ్డుపై అర్దరాత్రి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అమర్ దీప్ బాద్ షా సినిమాలోని బ్రహ్మనందం రీల్ చేసి కడుపుబ్బా నవ్వించాడు.
ఈ క్రమంలోనే రీతూ.. దసరా మూవీలోని కీర్తి సురేష్ చేసిన బరాత్ డ్యాన్స్ చేసి అలరించింది. వీరిద్దరు కలిసి ఓ తమిళ్ సాంగ్ కు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమర్ కామెడీ యాక్టింగ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అయితే రీతూ చౌదరి చేసి వీడియోస్ కు కామెంట్స్ ఆఫ్ చేశారు. ఇక రీతూ, అమర్ దీప్ తో ఎందుకు ఉంది.. నెక్ట్స్ ఏదైనా వెబ్ సిరీస్ లాంటి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? అంటూ మరికొంత మంది కామెంట్స్ పెట్టారు.