తెలుగు గ్లామరస్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. బుల్లితెరపై పాపులర్ గ్లామర్ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్న అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత అంతటి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది శ్రీముఖి. ఎప్పుడు చూసినా ఫుల్ యాక్టీవ్ గా, స్టేజిపై ఎంతో ఉత్సాహంగా సందడి చేసే శ్రీముఖి.. తన కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వస్తోంది. అలాగే తెలుగులో వరుస ప్రోగ్రాంస్, టీవీ షోలతో పాటు అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తోంది. అయితే.. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీముఖి.. బిగ్ బాస్ రియాలిటీ షోలో రన్నరప్ గా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మాక్సిమం అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే శ్రీముఖి.. అప్పుడప్పుడు గ్లామర్ గా కనిపించే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మెయింటైన్ చేస్తుంటుంది. అయితే.. చీరకట్టులో కూడా ఆకట్టుకునే అందం కలిగిన శ్రీముఖి.. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావ' పాటకు స్టేజిపై గ్లామరస్ పెర్ఫార్మన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇటీవల అదే పని చేసింది అమ్మడు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ అయినటువంటి ఆహాలో డాన్స్ ఆధారంగా ఓ టాలెంట్ షో ప్రారంభం కాబోతుంది. పాపులర్ హోస్ట్ ఓంకార్ నిర్వహించనున్న ఈ షో 'డాన్స్ ఐకాన్'గా ప్రసారం కానుండగా.. ఇందులో ఓ టీమ్ లీడర్ గా దర్శనం ఇవ్వనుంది శ్రీముఖి. సెప్టెంబర్ 11న డాన్స్ ఐకాన్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. కొత్తగా స్టార్ట్ కాబోతున్న ఈ షోలో శ్రీముఖి స్పెషల్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. అందులో గ్లామరస్ డ్రెస్ లో 'ఊ అంటావా మావ' పాటకు డ్యాన్సర్స్ తో కలిసి ఇంటెన్స్ స్టెప్పులు వేసింది. అనంతరం పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి సూపర్ హాట్ స్టెప్స్ వేసి అదరగొట్టింది. ప్రస్తుతం శ్రీముఖి ఓ ఊపేసిన పెర్ఫార్మన్స్ ప్రోమో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇక శ్రీముఖి డ్యాన్స్ పై నిర్మాత అల్లు అరవింద్, శేఖర్ మాస్టర్ ప్రశంసలు కురిపించారు. మరి సోషన్ మీడియాలో గ్లామర్ తో రచ్చలేపే శ్రీముఖి.. ఇకపై డాన్స్ ఐకాన్ లో సందడి చేయనుంది. మరి శ్రీముఖి డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.