సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుని, బిగ్‌బాస్ రియాలిటీ షోలో పార్టిసిపెట్ చేసిన కీర్తి భట్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలో నటుడు కార్తీక్‌తో కీర్తి ఏడడుగులు వెయ్యనుంది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా వల్ల సీరియల్ నటీనటులకు సినిమా స్టార్ల స్థాయిలో నేమ్, ఫేమ్ వస్తున్నాయి. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుని, బిగ్‌బాస్ రియాలిటీ షోలో పార్టిసిపెట్ చేసిన కీర్తి భట్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలో నటుడు కార్తీక్‌తో కీర్తి ఏడడుగులు వెయ్యనుంది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కీర్తి జీవితంలో జరిగిన బాధాకర సంఘటనల గురించి వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్లో కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అయితే ప్రమాదంలో గాయపడిన కీర్తి పిల్లల్ని కనలేదని డాక్టర్స్ చెప్పారు. దీంతో ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే ఆ పాప మరణించింది.
ఇక విజయ్ కార్తీక్ తోటతో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ప్రోమోలో కీర్తి, కార్తీక్ దండలు మార్చుకున్నారు. ‘నీకు నేను తోడుగా ఉంటాను.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా, నన్ను వదలకుండా ఇలాగే చూసుకో’ అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత ఈ జంట రింగ్స్ మార్చుకున్నారు. కార్తీక్ పేరెంట్స్ గురించి కీర్తి మాట్లాడుతూ.. ‘నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లలేనని తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకి చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా, నువ్వే మా పాపా. మనం పాపని దత్తత తీసుకుందాం’ అన్నారు అంటూ భావోద్వేగానికి గురైంది.
కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అతని స్వస్థలం. మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాడు. సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. కన్నడలో హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. తెలుగులో ‘ఏబీ పాజిటివ్’, ‘చెడ్డీ గ్యాంగ్’ వంటి చిత్రాల్లో నటించాడు. నిశ్చితార్థం చేసుకుని త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న కీర్తి – కార్తీక్ జంటకు టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.