బిగ్ బాస్ షో అంటేనే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. గత సీజన్లు అన్నీ అలానే ఉన్నాయి. ప్రస్తుత సీజన్ మాత్రం వాటితో పోలిస్తే తేలిపోయినట్లు అనిపించింది. తాజాగా వస్తున్న రేటింగ్సే దీనికి ఎగ్జాంపుల్. అయితే రెగ్యులర్ ఎపిసోడ్స్ తో పోలిస్తే.. వీకెండ్ , ఫ్యామిలీ ఎపిసోడ్స్ అనేవి పక్కా ఎంటర్ టైనింగ్ గా రెడీ చేస్తారు. అందుకు తగ్గట్లే డ్రామా వర్కౌట్ అయ్యేలా చూస్తారు. ఇందులో భాగంగా ఈసారి హౌసులో ఉన్నవారిని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇనయా విషయంలో జరిగింది మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ ఆర్జీవీతో డ్యాన్స్ చేసి ఫేమస్ అయిన బ్యూటీ ఇనయా సుల్తానా. రెండు సినిమాలు చేసినప్పటికీ ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిందో ఇనయా గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన తర్వాత.. తన ఇంట్లో గొడవలు అయ్యాయని, తనని దూరం పెట్టారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని చెప్పింది. ఈసారి బిగ్ బాస్ హౌసులో గొడవలు, టాస్కులు.. ఇలాప్రతి దానిలోనూ తన మార్క్ చూపిస్తూ వస్తోంది.
ఇక తాజాగా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి భార్య, కూతురు.. శ్రీహాన్ భార్య సిరితో పాటు వాళ్ల కొడుకు.. ఫైమా తల్లి.. రోహిత్ తల్లి.. శ్రీసత్య తల్లిదండ్రులు.. ఇలా చాలామంది బిగ్ బాస్ లోకి వచ్చారు. గురువారం ఎపిసోడ్ కోసం ఇయనా తల్లి హౌసులో అడుగుపెట్టారు. ‘నువ్వు గెలిచిరావాలి.. నీకోసం ఎదురుచూస్తున్నాం.. నువ్వు గెలిచి ఇంటికి రావాలి’ అని చెప్పడంతో ఇనయా ఎమోషనల్ అయింది. క్షమించమని కోరుతూ తల్లి కాళ్లపై పడింది. ఇదంతా చూస్తున్న నెటిజన్స్… ఇనయాని తల్లిదండ్రులు క్షమించేసినట్లే కనిపిస్తోంది. మరి బిగ్ బాస్ ప్రోమోలో ఇనయా ఎపిసోడ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చూస్తున్నారు.