బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్‌లో రచ్చ రచ్చ జరుగుతూనే ఉంది. తొలి కెప్టెన్ రావడం.. ఫినోలెక్స్ పైపుల సింహాసనంపై కూర్చోబెట్టి రాజువయ్యా మహరాజువయ్యా అంటూ బాలాదిత్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తొలి కెప్టెన్ రావడంతోనే విధులు, విధానాలు నిర్దేశించడం చూశాం. కొత్త కొత్త రూల్స్ కూడా పాస్ చేశారు. గొడవలు పడితే పనిష్మెంట్ ఇస్తానంటూ నయా నిబంధన తీసుకురావడం ఆసక్తి రేపుతోంది. బాలాదిత్య ఎవరికైనా, ఏ విషయమైనా చెప్పగలిగిన వ్యక్తి కాబట్టి.. తొలి కెప్టెన్ అతను అవ్వడంతో హౌస్ కచ్చితంగా గాడిలో పడుతుందని భావిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే బాలాదిత్య ఎంతో హుందాగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం.
ఇంక హౌస్‌లో ఏ ఇద్దరు కలిసినా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే చూస్తున్నాం. అలా ఎవరి ఒపీనియన్లను వాళ్లు వ్యక్త పరుస్తూ ఉన్నారు. అయితే బిగ్‌బాస్ ఈ క్లిప్స్ ని అంత తేలిగ్గా తీసిపారేయరు అని అందరికీ తెలిసిందే. ఎవరి గురించి మాట్లాడితే వాళ్లకే ఆ క్లిప్ చూపించి రెచ్చగొడతారని తెలుసు. అదే విషయం జరిగితే పాపం గలాటా గీతూ ఎన్నిసార్లు బుక్ అవుతుందో? ఎందుకంటే ఆమె చాలాసార్లు, చాలా సందర్భాల్లో ఇంట్లోని సభ్యులను జడ్జ్ చేస్తూ కనిపించింది. తాజాగా ఆమెను వరస్ట్ పర్ఫార్మర్ అంటూ జైల్లో కూడా పెట్టారు. అయితే అక్కడ కూడా గీతూ తన రివ్యూయింగ్ ఆపలేదు. ఇంట్లోని అందరి గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉంది.
జైల్లో కూర్చొన్న గీతూ దగ్గరకు ఫైమా వచ్చి కాసేపు మాట్లాడింది. ఆ సమయంలో గీతూ రాయల్ అంతా తనని వరస్ట్ అని నామినేట్ చేయడంపై స్పందించింది. “నలుగురు వేశారు కదా.. మనం కూడా వేస్తే పోయిద్ది అన్నట్లు అంతా నన్ను వరస్ట్ కంటెస్టెంట్ అని నామినేట్ చేశారు. నిజానికి నా కంటే మాట్లాడేవాళ్లు లేరా? రేవంత్ ఎలా మాట్లాడుతున్నాడు? ఇనయా సుల్తానా ఎలా బిహేవ్ చేస్తోంది? గీతూ రాయల్ ప్రశ్నలు సంధించింది. నేను అంటే ఈజా టార్గెట్ కాబట్టి ఇలా చేశారు. వాళ్లు కనిపించడం లేదా?” అంటూ గీతూ రాయల్ తన మనసులోని మాటలను బయట పెట్టింది. అంతా తనని టార్గెట్ చేసి ఇంకొరి వద్ద మంచోళ్లు అనిపించుకునేందుకు ఇలా చేశారంటూ కామెంట్ చేసింది. గీతూ రాయల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.